కరోనా కట్టడికి దిల్లీ ప్రభుత్వం సోమవారం రాత్రి నుంచి ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించిన వేళ.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వలస కార్మికులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో వస్తున్న ప్రజలతో రైల్వే స్టేషన్ ప్రాంగణంలో రద్దీ నెలకొంది.
ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ కారణంగా తమకు ఉపాధి కరువవుతుందని అందుకే స్వగ్రామాలకు వెళ్లాలని రైల్వే స్టేషన్‌కు వచ్చినట్లు కార్మికులు తెలిపారు.
ఇదీ చదవండి : '40 ఏళ్లు పైబడిన వారిపై వైరస్ ప్రభావం అధికం'