ETV Bharat / bharat

Foxconn Industry in Telangana : 'ఫాక్స్​కాన్​తో 35 వేల మందికి ఉపాధి' - Foxconn Industry Latest News

Foxconn Industry Investments in Telangana : సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా కొంగర్​కలాన్​లో ఇవాళ ఫాక్స్​కాన్ పరిశ్రమకు భూమిపూజ చేశారు.

KTR
KTR
author img

By

Published : May 15, 2023, 11:20 AM IST

Updated : May 15, 2023, 1:10 PM IST

Foxconn Industry in Telangana : రంగారెడ్డి జిల్లా కొంగర్​కలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫాక్స్‌కాన్ ఛైర్మన్‌ యాంగ్ లియూ పాల్గొన్నారు.

KTR laid Foundation For Foxconn Industry in Telangana : ఫాక్స్‌కాన్‌ పరిశ్రమ ఏడాదిలోగా పూర్తి కావాలని కోరుకుంటున్నాని మంత్రి కేటీఆర్ ఆకాక్షించారు. ఈ సంస్థకు అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పారు. 9 ఏళ్లుగా రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని వివరించారు. ఐటీ రంగంలో దేశంలోని ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం తెలంగాణకే దక్కిందని అన్నారు. ఫాక్స్‌కాన్‌తో ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశామని.. పరిశ్రమ పూర్తయ్యాక తొలి విడతలో 25,000 ఉద్యోగాలు వస్తాయని కేటీఆర్ వెల్లడించారు.

Foxconn Industry at Kongar kalan : 196 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీలో యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సారథ్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని పేర్కొన్నారు. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని వివరించారు. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు ఆనందంగా ఉందని కేటీఆర్ తెలిపారు.

"ఫాక్స్‌కాన్‌ కంపెనీ ఈ రాష్ట్రాన్ని ఎంచుకున్నందుకు ఆనందంగా ఉంది. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు. ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశాం. ఫాక్స్‌కాన్‌ కంపెనీలో మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు. యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. 9 ఏళ్లుగా రాష్ట్రం ప్రగతి పథంలో పరుగులు పెడుతోంది." - కేటీఆర్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి

కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు భూమిపూజ చేసిన కేటీఆర్‌

ఇవీ చదవండి : Telangana Weather report : మరో రెండ్రోజులు భగభగలే.. అందుకే ఈ జాగ్రత్తలు తప్పనిసరి

దిల్లీ చుట్టూ 'కన్నడ' రాజకీయం.. సీఎం అభ్యర్థిపై వీడని సస్పెన్స్​.. ఖర్గే చేతికి నివేదిక!

కొడుకు మృతదేహాన్ని బ్యాగులో పెట్టుకుని బస్సులో.. అంబులెన్స్​కు డబ్బులు లేక..

Last Updated : May 15, 2023, 1:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.