Nagarjuna Sagar Dispute : రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్ ముందు రోజు నాగార్జునసాగర్ జలాశయం వద్ద తలెత్తిన పరిస్థితులు, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. సాగర్ వివాదంపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గతంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఇటీవల సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల సమయంలోనూ వివాదం తలెత్తింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖ అధికారులతో నేడు దిల్లీ వేదికగా సమావేశం కానున్నారు.
KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ
Andhra Pradesh and Telangana Irrigation Ministers Meeting in Delhi : తెలంగాణ నీటిపారుదల శాఖ, ఏపీ జలవనరుల శాఖ అధికారులతో నేడు దిల్లీ వేదికగా సమావేశం కానున్నారు. నాలుగు అంశాలను సమావేశ ఎజెండాలో పొందుపరిచారు. నాగార్జునసాగర్ వద్ద ప్రస్తుత పరిస్థితిని సమీక్షించి తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్ డ్యాంల నిర్వహణకు సంబంధించి ఆపరేషన్ ప్రోటోకాల్ అంశంపై కూడా చర్చ జరగనుంది. కేంద్ర జలశక్తి శాఖ(Central Hydropower Department) గతంలో జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా నదిపై ప్రాధాన్యంగా గుర్తించిన 15 ఉమ్మడి జలాశయాల సంబంధిత ఔట్ లెట్లను నదీ యాజమాన్య బోర్డుకు స్వాధీనం చేయలేదు. దీంతో ఇవాళ్టి సమావేశంలో ఆ అంశం కూడా చర్చకు రానుంది.
నాగార్జునసాగర్ వివాదం - మరోమారు తెరపైకి కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టు స్వాధీనం అంశం
KRMB Budget Meeting in Delhi : కేఆర్ఎంబీకి రెండు రాష్ట్రాల నుంచి నిధుల విడుదల అంశం కూడా ఎజెండాలో ఉంది. బోర్డు నిర్వహణ కోసం బడ్జెట్‌కు అనుగుణంగా ప్రతి ఏటా తెలంగాణ, ఏపీ నిధులు విడుదల చేయాల్సి ఉంది. అయితే రెండు రాష్ట్రాల నుంచి సమయానికి నిధులు రాకపోగా, బకాయిలు కూడా భారీగానే ఉన్నాయి. ఉద్యోగులు, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉందని ఇటీవల బోర్డు పేర్కొంది. వాస్తవానికి నిధుల అంశంపై మొదట ఈ నెల 12వ తేదీన బోర్డు ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ్టి సమావేశం నేపథ్యంలో దాన్ని వాయిదా వేశారు. దీంతో నేడు సమావేశంలో బోర్డుకు నిధుల అంశం కూడా చర్చకు రానుంది. వీటితో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఇతర అంశాలు, పరస్పర ఫిర్యాదులు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.
మళ్లీ మొదటికి వచ్చిన శ్రీశైలం, సాగర్ నిర్వహణ
సాగర్ కుడి కాల్వ నుంచి ఐదు టీఎంసీల నీటిని తీసుకునేందుకు ఏపీకి కేఆర్ఎంబీ గ్రీన్‌సిగ్నల్