Kodi Katti Case Latest Updates: కోడికత్తి కేసులో సీఎం జగన్ మోహన్ రెడ్డి పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది. పిటిషన్‌కు నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని న్యాయస్థానం ఆదేశించింది. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో దాడి ఘటన కేసులో.. లోతైన దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు.
కోడికత్తితో తనపై జరిగిన దాడిలో కుట్ర కోణం ఉందని, దీనిపై లోతైన దర్యాప్తు జరపాలంటూ విజయవాడలోని ఎన్‌ఐఏ కోర్టులో (సాక్షుల విచారణకు షెడ్యూల్ ప్రకటించి, వాంగ్మూలాల నమోదు దశలో) జగన్ పిటిషన్ వేశారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండానే ఎన్‌ఐఏ అభియోగపత్రం దాఖలు చేసిందని పేర్కొన్నారు. నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా క్యాంటిన్ నిర్వాహకుడు విధుల్లోకి తీసుకున్నారని అన్నారు. కుట్ర కోణం తేల్చేందుకు మరింత లోతైన విచారణ జరపించాలని కోరారు. ఎన్‌ఐఏ కోర్టు జులై 25వ తేదీన ఈ పిటిషన్‌ను కొట్టివేయడంతో జగన్ మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
"నా కొడుకును నా వద్దకు చేర్చకపోతే ఆత్మహత్యే శరణ్యం".. కోడికత్తి నిందితుడి తల్లి ఆవేదన
కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ రిమాండ్ పొడిగింపు: కోడికత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ రిమాండ్‌ను ఈనెల 27 వరకు విశాఖ ఎన్ఐఏ ఏడీజే కోర్టు పొడిగించింది. ఈ మేరకు నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయవాదితో పోలీసులు మాట్లాడనీయట్లేదన్న నిందితుడు శ్రీనివాస్ విచారణ సమయంలో జడ్జి ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఐదేళ్ల నుంచి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయాడు.
ఐదేళ్ల నుంచి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు: సీఎం జగన్ ఇంటి నుంచి హాజరవుతానంటున్నారని నిందితుడి తరఫు న్యాయవాది సలీం అన్నారు. నా క్లయింట్ శ్రీనివాస్ కూడా అలాగే హాజరవుతారని.. నిందితుడికి ఐదేళ్ల నుంచి బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. కేసు విచారణ హైకోర్టులోనే జరగాలని.. నవంబర్ 17 లోపు హైకోర్టులో పిటిషన్ వేస్తానని న్యాయవాది సలీం చెప్పారు. ఇకపై హైకోర్టులోనే విచారణ జరగాలని.. కేవలం రాజకీయ లబ్ది కోసం విశాఖలో విచారణ చేస్తున్నారని న్యాయవాది సలీం విమర్శించారు.
Kodi Katti Case: "నాకు జైలు నుంచి విముక్తి కలిగించండి".. సీజేఐకు కోడికత్తి నిందితుడి లేఖ
కోర్టుకు హాజరుకాకుండా: మరోవైపు చాలా కాలంగా జగన్ కోర్టుకు హాజరుకాకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. తాను కోర్టుకు హాజరైతో ట్రాఫిక్ సమస్యలు వస్తాయని.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని అన్నారు. దీనిపై ప్రజాసంఘాలు, దళిత సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు దళితుడు కావడం వల్ల ఇబ్బంది పెడుతున్నారని.. సుమారు అయిదు సంవత్సరాల నుంచి కోర్టుకి హాజరుకావడానికి జగన్ తాత్సారం చేస్తున్నారని మండిపడుతున్నారు.
అయిదేళ్లుగా జైలులోనే: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2018 అక్టోబర్ 25వ తేదీన విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో ఆయనపై దాడి జరిగింది. నిందితుడు శ్రీను కోడి పందేల్లో ఉపయోగించే కత్తితో దాడి చేయడంతో పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అయిదేళ్ల నుంచి కోడి కత్తి కేసు విచారణ కొనసాగుతోంది. కేసులో కుట్ర కోణం లేదని ఎన్‌ఐఏ ఇప్పటికే తేల్చి చెప్పినా.. నేటికీ నిందితుడు శ్రీనుకు బెయిల్ మంజూరు కాలేదు.
Kodi Katthi Case: కోడి కత్తి కేసు.. జగన్ అభియోగాలన్నీ కట్టు కథలే.. జాతీయ దర్యాప్తు సంస్థ