ETV Bharat / bharat

ఫ్లైట్​ క్యాన్సిల్​ అయితే రూ.10వేలు పరిహారం.. బోర్డింగ్​కు నిరాకరిస్తే రూ.20వేలు!

విమాన ప్రయాణికులకు శుభవార్త. ఇకపై ఫ్లైట్ రద్దయితే పాసింజర్లకు రూ.10వేల వరకు పరిహారం అందనుంది. విమానయాన సంస్థలు బోర్డింగ్​కు నిరాకరిస్తే రూ.20 వేల వరకు పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది.

flight cancellation compensation india
ఫ్లైట్​ క్యాన్సిల్​ అయితే రూ.10వేలు పరిహారం.. బోర్డింగ్​ను నిరాకరిస్తే రూ.20వేలు!
author img

By

Published : Dec 23, 2022, 2:14 PM IST

Updated : Dec 23, 2022, 4:00 PM IST

Flight cancellation compensation India : మీరు విమాన ప్రయాణం ఎక్కువగా చేస్తుంటారా? అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే!. విమానయాన సంస్థలు మీ వద్ద టికెట్ ఉండి బోర్డింగ్ సమయంలో ఫ్లైట్ ఎక్కించుకోకపోతే.. మీకు రూ.20 వేలు నష్ట పరిహారం అందనుంది. ఒకవేళ ఫ్లైట్ రద్దయితే పాసింజర్లకు సంబంధిత ఎయిర్​లైన్స్​ సంస్థలు రూ.10వేల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) త్వరలోనే ఈ నిబంధనలను అమలు చేయనుంది. ఇటీవలే విమానయాన సంస్థలపై ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో డీజీసీఏ ఈ మేరకు నిబంధనలను తీసుకువచ్చింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ రూల్స్ అమలవుతాయని సమాచారం.

ఫ్లైట్​ రద్దు అయితే?..

  1. విమానయాన సంస్థ తమ విమానాన్ని రద్దు చేయాలని భావిస్తే.. రెండు వారాల ముందుగానే ప్యాసింజర్లకు తెలిపి ప్రత్యామ్నాయ ఫ్లైట్​ను ఏర్పాటు చేయాలి.
  2. ప్రయాణానికి ఒక రోజు లేదా రెండు వారాల లోపు ఫైట్​ రద్దు చేస్తే.. ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేయాలి లేదా టికెట్​ సొమ్మును తిరిగి చెల్లించాలి.
  3. 24 గంటల కంటే తక్కువ వ్యవధిలో ఎయిర్‌లైన్ సంస్థ విమానాన్ని రద్దు చేస్తే.. ప్యాసింజర్లకు అత్యధికంగా రూ.10 వేల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. అందుకు సంబంధించిన వివరాలను డీజీసీఏ తెలిపింది.

బోర్డింగ్​కు నిరాకరిస్తే?..

  1. ఫ్లైట్​లో ఓవర్​బుకింగ్​ జరిగితే.. సంబంధిత ఎయిర్​లైన్స్​ సంస్థ ప్రయాణికులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలి.
  2. విమానయాన సంస్థలు బోర్డింగ్​కు నిరాకరిస్తే.. గంటలోపు వేరే ఫ్లైట్​ను ఏర్పాటు చేయాలి లేకపోతే రూ.20 వేల వరకు పరిహారం చెల్లించాలి.

Last Updated : Dec 23, 2022, 4:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.