Kishore Upadhyay News: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ్.. పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరణకు గురయ్యారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధిష్ఠానం తెలిపింది. క్రమశిక్షణా చర్యల కింద అన్ని పదవుల నుంచి గతంలోనే ఆయనను తొలగించింది కాంగ్రెస్ పార్టీ.
![Congress chief Kishore Upadhyay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14293519_img3.png)
"పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పార్టీ సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తున్నాం."
-ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ)
Kishore Upadhyay to Join BJP: అయితే.. ఉత్తరాఖండ్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కిశోర్ ఉపాధ్యాయ్ భాజపాలో చేరారు. ఉత్తరాఖండ్ భాజపా వ్యవహారాల ఇంఛార్జ్ ప్రహ్లాద్ జోషితో సహా ప్రముఖుల సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకే భాజపాలో చేరినట్లు తెలిపారు. తన నిర్ణయానికి గల కారణాన్ని కాంగ్రెస్‌నే అడగాలని చెప్పారు.
![Kishore Upadhyay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14293519_olm1-1.jpg)
కిశోర్ ఉపాధ్యాయ్‌కు మంచి పట్టున్న 'టిహరీ' నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2002, 2007 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచే పోటీ చేసి గెలుపొందారు.
![Kishore Upadhyay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14293519_olm1-2.jpg)
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్లు గుడ్‌బై.. వరుస వలసలకు కారణమేంటి?