ETV Bharat / bharat

రోగిని స్ట్రెచర్​పై డాక్టర్ ఇంటికే తీసుకెళ్లిన బంధువులు

author img

By

Published : May 7, 2022, 7:35 PM IST

వైద్యుడు ఆస్పత్రిలో లేడని తెలిసి రోగిని స్ట్రెచర్​పై ఆయన ఇంటికే తీసుకెళ్లారు బంధువులు. ఛత్తీస్​గఢ్​ కోరియా జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

patient on stretcher to doctor's house
రోగిని స్ట్రెచర్​పై డాక్టర్ ఇంటికే తీసుకెళ్లిన బంధువులు

రోగిని స్ట్రెచర్​పై డాక్టర్ ఇంటికే తీసుకెళ్లిన బంధువులు

ఓ రోగిని జిల్లా ఆస్పత్రి నుంచి స్ట్రెచర్​పై నేరుగా డాక్టర్ ఇంటికే తీసుకెళ్లారు బంధువులు. ఆస్పత్రిలో ప్రముఖ వైద్యుడు లేడని తెలిసి, ఎలాగైనా అతని వద్దకే వెళ్లాలని ఇలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ఛత్తీస్​గఢ్​ కోరియా జిల్లాలోని వైకుంఠపుర్​లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.

ఆస్పత్రి సివిల్ సర్జన్​ కేఎల్ ధ్రువ్ దీనిపై వివరణ ఇచ్చారు. ఓ కుటుంబం రోగిని మధ్యాహ్నం 1:30 గంటలకు ఆస్పత్రికి తీసుకొచ్చిందని, కానీ 1:00 గంటలకే ఓపీ టైం అయిపోయిందని చెప్పారు. రోగిని చూడటానికి ప్రముఖ వైద్యుడు ఆస్పత్రిలో లేడని తెలిశాక కుటుంబసభ్యులు అతడ్ని స్ట్రెచర్​పై డాక్టర్ ఇంటికే తీసుకెళ్లారని చెప్పారు. అయితే డాక్టర్ సూచన మేరకు రోగిని మళ్లీ ఆస్పత్రికే తీసుకొచ్చారని, చికిత్స ప్రారంభించామని పేర్కొన్నారు. ఓపీ టైం అయిపోవడం వల్ల స్ట్రెచర్​ను తీసుకెళ్లడం సిబ్బంది ఎవరూ గమనించలేదన్నారు.

యూపీలోనూ: ఉత్తర్​ప్రేదశ్​ బాలియాలో ఓ రోగిని చక్రాల బండిపై ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అంబులెన్స్ డ్రైవర్ పెట్రోల్ లేదని నిరాకరించడం వల్ల గత్యంతరం లేక ఇలా చేశారు. అయితే ఈ ఘటనకు అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని జిల్లా వైద్యాధికారి నీరజ్ పాండే తెలిపారు.

ఇదీ చదవండి: మహిళపై తాంత్రికుడి అత్యాచారం.. 79 రోజులు నరకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.