ETV Bharat / bharat

13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్​రేప్​, ఆరు రోజులకు పైగా - ఇన్​స్టాగ్రామ్​ ఫ్రెండ్​పై గ్యాంగ్​రేప్​

13 ఏళ్ల బాలికను కిడ్నాప్​ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు కామాంధులు. అనంతరం రైల్వే స్టేషన్​లో వదిలేసి పారిపోయారు. ఈ దారుణ ఘటన బిహార్​లో జరిగింది. మరోవైపు ఇన్​స్టాగ్రామ్​లో పరిచయమైన యువతిని ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపి గ్యాంగ్​ రేప్​ చేశారు ముగ్గురు యువకులు. దిల్లీలో జరిగిందీ ఘటన.

gang rape on kidnapped 13 year girl
gang rape on kidnapped 13 year girl
author img

By

Published : Aug 23, 2022, 11:16 AM IST

బిహార్​లోని బక్సర్​ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 13 ఏళ్ల బాలికను కిడ్నాప్​ చేసి ఆరుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కిడ్నాప్​ చేసిన ఆరు రోజుల తరువాత బాధితురాల్ని రైల్వే ప్లాట్​ఫాంపై వదిలి పారిపోయారు.

పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలోని డుమ్రావ్​​ సబ్​ డివిజన్​కు చెందిన బాధితురాల్ని ఆరు రోజుల క్రితం ఆరుగురు యువకులు కిడ్నాప్​ చేశారు. అనంతరం పట్నా తీసుకెళ్లి బందీగా ఉంచి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అయితే అప్పటికే బాధితురాలి తల్లిదండ్రులు బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా డుమ్రావ్​​ రైల్వేస్టేషన్​లో బాధితురాలు ఉన్నట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి వాంగ్మూలం మేరకు గాలింపు చర్యలను వేగవంతం చేసిన పోలీసులు.. ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేశారు. మిగతా నలుగురి కోసం గాలిస్తున్నారు.

ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం.. యువతిపై గ్యాంగ్​రేప్​
దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని ఆశ చూపించి ఓ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం.. దిల్లీకి చెందిన బాధితురాలికి గ్వాలియర్​లో నివాసం ఉంటున్న అర్జున్​ అనే యువకుడితో ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఫోన్​ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అయితే బాధితురాలికి ఉద్యోగం ఇస్తానని చెప్పి ధోల్​పుర్​ రమ్మని పిలిచాడు యువకుడు. అర్జున్​ చెప్పినట్టుగా వచ్చిన బాధితురాల్ని ప్రలోభ పెట్టి గులాబ్​ బాగ్​ కూడలిలో ఉన్న ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. ఈ విషయం పోలీసులకు చెబితే చంపేస్తామని బెదిరించి ముగ్గురు యువకులు పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. యువకుడి ఇన్​స్టా ఐడీ, ఫోన్​ నెంబర్​ ద్వారా నిందితుల కోసం దర్యాప్తు చేపడుతున్నారు.

ఇవీ చదవండి: ఆటో ఎక్కుతుండగా విద్యార్థులకు కరెంట్​ షాక్​, ఒక్కసారిగా

నిరసన చేస్తున్న విద్యార్థిని చావబాదిన ఏడీఎం, చేతిలో జెండా ఉన్నా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.