ETV Bharat / bharat

పొలిటికల్ మ్యాజిక్‌- అభ్యర్థులు వారే గుర్తులే మారే - తెలంగాణ తాజా రాజకీయ వార్తలు

Khamam District Political War : రాజకీయాల్లో శాశ్వత శత్రువులు... శాశ్వత మిత్రులు ఉండరనేది నానుడి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖచిత్రం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. 2018 ఎన్నికల్లో వేర్వేరు పార్టీల్లో ఉన్నవారు అటూ ఇటూ మారిపోయారు. పార్టీల మార్పుతో కొన్ని నియోజకవర్గాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. అప్పట్లో ఒక గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు.. ఈసారి తమ గుర్తు మారిందంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయం సర్వాత్రా ఆసక్తి రేపుతోంది.

Political Twists in Telangana
Khammam District Political War
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 7:13 AM IST

పొలిటికల్ మ్యాజిక్‌- అభ్యర్థులు వారే గుర్తులే మారే

Khammam District Political War : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆద్యంతం రక్తి కట్టిస్తోంది. 2018 నుంచి 2023 మధ్య చోటు చేసుకున్న పరిణామాలతో... కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాత అభ్యర్థులే పోటీ పడుతున్నా... వారి పార్టీలు, గుర్తులు మారాయి. ఇల్లందు నియోజకవర్గంలో పోటీ పడుతున్న బానోత్ హరిప్రియ నాయక్, కోరం కనకయ్య గత ఎన్నికల్లో ప్రత్యర్థులే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌(BRS) నుంచి పోటీ చేసిన ఇద్దరు... ఇప్పుడు అటూ ఇటూ మారారు.

కాంగ్రెస్​ గెలిస్తే ధరణి బంగాళాఖాతంలోకి - రైతులు అరేబియా సముద్రంలోకి : సీఎం కేసీఆర్

Telangana Assembly Elections 2023 : ఓటర్లకు మారిన గుర్తులు తెలిపేందుకు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు. తనది హస్తం(Congress) గుర్తుని కనయ్య.. కారు గుర్తుపై పోటీ చేస్తున్నాని హరిప్రియనాయక్‌ ప్రచారం చేసుకుంటున్నారు. పినపాక నియోజకవర్గంలోనూ... ఇలాంటి చిత్రమే కనిపిస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన రేగా కాంతారావు... ఇప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి, అప్పుడు బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన పాయం వెంటకేశ్వర్లు... ఈసారి కాంగ్రెస్‌ నుంచి తలపడుతున్నారు. కొత్త గుర్తులతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

Political Twists in Telangana : 2018 ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో.. కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన కందాల ఉపేందర్‌రెడ్డి ఈసారి బీఆర్‌ఎస్‌ నుంచి కారు గుర్తుపై పోటీ చేస్తున్నారు. పాలేరులో కారు గుర్తుపై బరిలో నిలిచిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఈసారి కాంగ్రెస్‌లో చేరి ఖమ్మం నుంచి హస్తం గుర్తుపై రంగంలోకి దిగారు. టీడీపీ నుంచి మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ ఘనత సాధించిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య. ఈసారి కారు గుర్తుతో ప్రజల్లోకి వెళ్తున్నారు.

Political Heat in Paleru Constituency : రసవత్తరంగా పాలేరు పోరు.. ముఖ్య నేతల పోటీతో మారిన రాజకీయ సమీకరణాలు

అశ్వారావుపేటలోనూ ఇదే పరిస్థితి. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున సైకిల్‌ గుర్తుపై పోటీ చేసిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు.. ఈసారి బీఆర్‌ఎస్‌ నుంచి బరిలోకి దిగి కారు గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థిస్తున్నారు. కొత్తగూడెం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. ఈ సారి కారు గుర్తుకు ఓటు వేయాలంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు.

ఐదేళ్లలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 6నియోజకవర్గాల్లో రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. వారు వీరయ్యారు. వీరు వారయ్యారు. గత ఎన్నికల్లో.. ఒక గుర్తుకు ఓటు వేయాలంటూ అభ్యర్థించిన వారంతా.. ఈసారి మరో గుర్తుతో ఓటర్ల ముందుకు రావడం.. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

CM KCR Speech at Paleru Meeting : కాంగ్రెస్ అధికారంలోకి​ వస్తే రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జైభీమ్‌ అంటారు : సీఎం కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.