ETV Bharat / bharat

కేరళలో తగ్గిన కరోనా ఉద్ధృతి - కొత్తగా 13,984 కేసులు - మహారాష్ట్రలో కరోనా కేసులు

కేరళలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 13,984 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 118 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 4,869 కరోనా కేసులు నమోదయ్యాయి.

corona in states
దేశంలో కరోనా కేసులు
author img

By

Published : Aug 2, 2021, 10:24 PM IST

కేరళలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. గత ఆరు రోజులుగా 20,000కు పైగా నమోదవ్వగా.. సోమవారం 14వేల లోపునకే పరిమితమయ్యాయి. కొత్తగా ఆ రాష్ట్రంలో 13,984 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 118 మంది వైరస్​ ధాటికి మరణించారు.

మరోవైపు.. మహారాష్ట్రలో కొత్తగా 4,869 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో ఒక్కరోజే 1,285 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 25 మంది చనిపోగా.. మరణాల సంఖ్య 20,021కి పెరిగింది.

ఆర్​టీ-పీసీఆర్​ తప్పనిసరి

కరోనా నేపథ్యంలో బయటి రాష్ట్రాల నుంచి వచ్చేవారు... తప్పనిసరిగా ఆర్​టీ-పీసీఆర్​ పరీక్ష నెగెటివ్​ ధ్రువపత్రాన్ని తీసుకురావాలని కర్ణాటక ప్రభుత్వం ఆంక్షలు విధించింది. పరీక్ష ఫలితం లేనట్లయితే.. తమ రాష్ట్రం పరీక్షలు నిర్వహించుకోవాలని చెప్పింది. అయితే.. ఆ పరీక్ష ఫలితం వచ్చేవరకు సంస్థాగత క్వారంటైన్​లోనే ఉండాలని స్పష్టం చేసింది.

మిగతా రాష్ట్రాల్లో ఇలా..

  • తమిళనాడులో కొత్తగా 1,957 మందికి కరోనా పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. వైరస్​ ధాటికి మరో 28 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 1,032 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 97 మంది మరణించారు.
  • గుజరాత్​లో 22 కేసులు నమోదు కాగా.. మధ్యప్రదేశ్​లో కొత్తగా 17 కరోనా కేసులు నమోదయ్యాయి.
  • హిమాచల్​ ప్రదేశ్​లో 208 మందికి కరోనా సోకినట్లు తేలింది.

ఇదీ చూడండి: 'డెల్టా' దెబ్బకు ఆసుపత్రులు ఫుల్- మళ్లీ ఆంక్షలు!​

ఇదీ చూడండి: 'మానవ శరీరంలోనే కొత్త వేరియంట్లకు బీజాలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.