ETV Bharat / bharat

Corona cases: కేరళలో భారీగా తగ్గిన మరణాలు- స్థిరంగా కేసులు - kerala health minister veena george

కేరళలో కొత్తగా 7,427 మందికి కరోనా(Kerala Corona Cases) సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా మరో 62 మంది మరణించారు. మరోవైపు.. తమిళనాడులో కొత్తగా 1,021 కేసులు వెలుగు చూశాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27 లక్షలు దాటింది.

Kerala Corona Cases
కేరళ కరోనా కేసులు
author img

By

Published : Oct 30, 2021, 9:31 PM IST

కేరళలో కరోనా(Kerala Corona Cases) వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలో కొత్తగా 7,427 మంది వైరస్(Kerala Covid Cases Today) బారినపడ్డారు. అయితే.. కొవిడ్​ మరణాల సంఖ్య క్రితం రోజుతో పోలిస్తే భారీగా తగ్గింది. వైరస్ ధాటికి ఆ రాష్ట్రంలో మరో 62 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కరోనా బాధితుల సంఖ్య 49,61,490కి చేరగా.. మొత్తం మరణాల సంఖ్య 31,514కు పెరిగింది.

కేరళలో మరో 7,166 మంది వైరస్​ను(Kerala Corona Cases) జయించారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఓ ప్రకటనలో తెలిపారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 48,50,742కు చేరుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 78,624 యాక్టివ్​ కేసులు ఉన్నాయి. కొత్తగా 76,709 నమూనాలను పరీక్షించగా.. తిరువనంతపురం జిల్లాలో అత్యధికంగా 1,001 మందికి కొత్తగా వైరస్​ సోకినట్లు తేలింది. కోజికోడ్​లో 997, ఎర్నాకులంలో 862 మందికి వైరస్ నిర్ధరణ అయింది.

మరోవైపు.. దేశ రాజధాని దిల్లీలో 37 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. కొత్తగా ఎవరూ చనిపోలేదు.

వివిధ రాష్ట్రాల్లో కరోనా కేసులు..

  • తమిళనాడులో 1,021 మంది మహమ్మారి బారినపడ్డారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 27లక్షలు దాటింది. వైరస్ కారణంగా మరో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • కర్ణాటకలో 347 కరోనా కొత్త వెలుగు చూశాయి. మరో 10 మంది మృతి చెందారు.
  • ఒడిశాలో కొత్తగా 374 మందికి కరోనా సోకగా.. మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

ఇవీ చూడండి:

కరోనా మూలాలు ఎప్పటికీ కనుక్కోలేమా?- నిఘా సంస్థల మాటేంటి?

చిన్నారులకు ఫైజర్​ టీకా పంపిణీకి ఆమోదం

రష్యాలో కరోనా మరణమృదంగం..రెండో రోజూ రికార్డు మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.