ETV Bharat / bharat

కేరళలో భారీగా తగ్గిన కరోనా కేసులు

కేరళలో కరోనా వ్యాప్తి తగ్గముఖం పట్టినట్లు కనిపిస్తోంది. కొత్తగా ఆ రాష్ట్రంలో 13 వేల మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్​తో మరో 105 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో కొత్తగా 4 వేల కేసులు వెలుగు చూశాయి.

corona cases in states
రాష్ట్రాల్లో కరోనా కేసులు
author img

By

Published : Aug 9, 2021, 10:57 PM IST

కేరళలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 13,049 కేసులు నమోదయ్యాయి. మరో 20,004 మంది కోలుకోగా.. మహమ్మారి ధాటికి 105 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 35.65 లక్షలకు చేరింది. ఇప్పటివరకు 17,852 మంది వైరస్​ బారిన పడి మృతిచెందారు.

మహారాష్ట్రలో కొత్తగా 4,005 మందికి కరోనా సోకింది. 7,568 మంది కోలుకోగా.. 68 మంది మృతిచెందారు. మరోవైపు దేశ రాజధాని దిల్లీలో 39 కొవిడ్​ కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఒకరు మృతి చెందారు.

ఉత్తరాఖండ్​లో వైరస్​ కట్టడి కోసం.. ఆగస్టు 10 ఉదయం 6 గంటల నుంచి నుంచి ఆగస్టు 17 వరకు ఉదయం 6 గంటల వరకు కొవిడ్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్రంలో కొత్తగా 31 మందికి కరోనా సోకింది. మరొకరు కరోనాతో ప్రాణాలు విడిచారు.

మిగతా రాష్ట్రాల్లో ఇలా...

  • తమిళనాడులో 1,929 కరోనా కేసులు వెలుగు చూశాయి. వైరస్ ధాటికి 23 మంది బలయ్యారు.
  • కర్ణాటకలో కొత్తగా 1,186 కేసులు నమోదయ్యాయి. 1,776 మంది కోలుకోగా.. 24 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • ఒడిశాలో కొత్తగా 886 మందికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మరో 66 మంది మృతిచెందారు.
  • హిమాచల్​ ప్రదేశ్​లో కొత్తగా 310 మందికి కరోనా సోకింది. 185 మంది కోలుకోగా.. ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
  • ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా 23 మందికి కరోనా సోకినట్లు తేలింది. వైరస్ కారణంగా ఒకరు చనిపోయారు.
  • బంగాల్​లో కొత్తగా 557 మందికి వైరస్ సోకింది. కొవిడ్​ కారణంగా మరో 11 మంది మరణించారు.

ఇదీ చూడండి: 'శివుడే మా సీఎం- కరోనాతో మాకు భయమేంటి?'

ఇదీ చూడండి: వ్యాక్సిన్​ వేసుకున్న, వేసుకోని వారిలో కరోనా లక్షణాలు ఇవే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.