ETV Bharat / bharat

ఊరి మధ్యలో కొండచిలువ.. అటవీ సిబ్బంది రారు.. పోలీసులు తీసుకోరు!

author img

By

Published : Mar 30, 2022, 1:32 PM IST

Kerala python tension: కేరళలో కొండచిలువ బయటపడటం కలకలం రేపింది. దాన్ని పట్టుకున్న స్థానికులు పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు. అయితే, కొండచిలువను అటవీ అధికారులకే అప్పగించాలని పోలీసులు తేల్చి చెప్పడం వల్ల.. స్టేషన్​లో ఉద్రిక్తత తలెత్తింది.

kerala python news
kerala python news
కాలువలో భారీ కొండచిలువ

Kerala python tension: కేరళ కొట్టాయంలో ఓ కొండచిలువ హల్​చల్ సృష్టించింది. ఓ కాలువను శుభ్రం చేస్తుండగా ఈ భారీ సర్పం బయటపడింది. ఈ విషయం స్థానికులకు, అక్కడి పోలీసులకు మధ్య వాగ్వాదానికి దారితీసింది. కొండచిలువతో పాటు 15 పాము గుడ్లు సైతం స్థానికుల కంటపడ్డాయి. పైథాన్​ను చాకచక్యంగా బంధించి.. గుడ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే, వీటిని అప్పగించేందుకు సమాచారం అందించగా.. అటవీ అధికారులెవరూ సరైన సమయానికి రాలేదని స్థానికులు ఆరోపించారు. దీంతో పైథాన్​ను ఓ ప్లాస్టిక్ సంచిలో కట్టి.. పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు.

కొండచిలువను తీసుకునేందుకు పోలీసులు నిరాకరించారు. అది అటవీ అధికారుల పని అని.. పోలీస్ స్టేషన్​లో వదిలి వెళ్లకూడదని చెప్పారు. కొండచిలువకు ఏమైనా గాయాలు అయ్యాయా అన్న విషయాన్ని అటవీ అధికారులు పరిశీలిస్తారని స్థానికులకు స్పష్టం చేశారు. అప్పటివరకు ఎవరూ స్టేషన్​ను విడిచి వెళ్లవద్దని తేల్చిచెప్పారు. పోలీసుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో స్టేషన్ వద్ద నాటకీయ పరిస్థితులు తలెత్తాయి. అయినప్పటికీ పోలీసులు తమ వైఖరి మార్చుకోలేదని స్థానికులు చెప్పారు. అటవీ అధికారులు తీరిగ్గా సాయంత్రం వచ్చిన తర్వాతే సమస్య సద్దుమణిగిందని తెలిపారు. నాలుగు గంటలు వేచి చూసిన తర్వాత వారు పోలీస్ స్టేషన్​కు వచ్చి కొండచిలువను తీసుకెళ్లారని వివరించారు.

ఇదీ చదవండి: భార్యపై అనుమానం... పిల్లలు సహా నలుగురి హత్య!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.