ETV Bharat / bharat

అధికార దుర్వినియోగం చేసిన మంత్రి రాజీనామా - కేరళ మంత్రి కేటీ జలీల్ రాజీనామా

కేరళలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన మంత్రి కేటీ జలీల్ రాజీనామా చేశారు. తనపై వచ్చిన బంధుప్రీతి అభియోగాలను రాష్ట్ర లోకాయుక్త నిర్ధరించినందున ఈ మేరకు రాజీనామా లేఖను సీఎం విజయన్​కు పంపించారు.

Kerala minister K T Jaleel resigns following Lokayukta's adverse finding
అధికార దుర్వినియోగం చేసిన మంత్రి రాజీనామా
author img

By

Published : Apr 13, 2021, 4:09 PM IST

కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయనపై అధికార దుర్వినియోగం, బంధుప్రీతి అభియోగాలను రాష్ట్ర లోకాయుక్త ఇటీవలే నిర్ధరించింది. ఆయన పదవిలో కొనసాగరాదని ఆదేశిస్తూ ఈ నెల 9న సీఎం పినరయ్​ విజయన్​కు నివేదిక సమర్పించింది. దీంతో తన రాజీనామాను విజయన్​కు పంపించారు జలీల్. వెంటనే సీఎం ఆ లేఖను గవర్నర్ ఆమోదం కోసం పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాజీనామా విషయాన్ని ఫేస్​బుక్​ ద్వారా వెల్లడించిన జలీల్.. దీంతో తనపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వారికి ఉపశమనం దక్కిందని వ్యాఖ్యానించారు. రెండేళ్లుగా మీడియా తనపై దాడి చేస్తోందని ఆరోపించారు.

ఇంతకుముందూ..

ఎల్​డీఎఫ్​ మంత్రివర్గం నుంచి బంధుప్రీతి అభియోగాలపై రాజీనామా చేసిన రెండో మంత్రి జలీల్. అంతకుముందు 2016లో నిబంధనలు ఉల్లంఘించి కేరళ ఇండస్ట్రీస్​ ఎంటర్​ప్రైజెస్ లిమిటెడ్​కు మేనేజింగ్​ డైరెక్టర్​గా తన బంధువును నియమించిన వ్యవహారంలో పరిశ్రమల శాఖ మంత్రి ఈపీ రంజన్ రాజీనామా చేశారు. రెండేళ్ల తర్వాత తిరిగి ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం గమనార్హం.

ఇదీ చూడండి: మంగళూరు తీరంలో పడవ ప్రమాదం- ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.