Kerala Medical Student Committed Suicide by Hanging in Visakha Lodge: విశాఖ డాబా గార్డెన్స్‌లోని ఓ లాడ్జిలో కేరళకు చెందిన మెడికో ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. కేరళ రాష్ట్రం త్రిసూర్ జిల్లా వందపల్లి గ్రామానికి చెందిన రమేష్ కృష్ణ అనే యువతి లాడ్జి గదిలో ఉరివేసుకొని వేలాడుతూ ఉంది. లోపల నుంచి గడియ పెట్టుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అనుమానించిన లాడ్జి నిర్వాహకులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లాడ్జ్‌లో రూము తలుపులు విరగ్గొట్టి లోపలికి వెళ్లారు. ఘటనా స్థలంలో వేలాడుతూ ఉన్న మృతదేహం పక్కన సూసైడ్ నోట్ కూడా లభించింది. మృతురాలి ఫోన్ ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో, మృతురాలు చైనాలో ఎంబీబీఎస్ ఫోర్త్ ఇయర్ చదువుతున్నట్లు తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఇంట్లో హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పిందని.. విశాఖ ఎందుకు వెళ్లిందో తెలియడం లేదని వారు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించిన రెండవ పట్టణ పోలీసులు.. తల్లిదండ్రులు విశాఖ వచ్చాక పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.
Kerala Medical Student Committed Suicide: విశాఖలో కేరళకు చెందిన వైద్యవిద్యార్థిని ఆత్మహత్య - లాడ్జిలో ఉరి వేసుకున్న రమేశ్ కృష్ణ
Published : Aug 25, 2023, 5:35 PM IST
|Updated : Aug 25, 2023, 7:44 PM IST
17:23 August 25
విశాఖ టూటౌన్‌లోని లాడ్జిలో ఉరి వేసుకున్న రమేశ్ కృష్ణ