ETV Bharat / bharat

కేరళలో ఆగని కరోనా.. లాక్​డౌన్​పై సీఎం మాటేంటి?

కేరళలో కరోనా ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. కొత్తగా 29,322 కేసులు నమోదయ్యాయి. మరో 131 మంది మృతిచెందారు. 22,938 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17.91గా ఉంది.

Kerala
కరోనా
author img

By

Published : Sep 3, 2021, 11:33 PM IST

కేరళలో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం కొత్తగా 29,322 మందికి వైరస్ నిర్ధరణ అయింది. మహమ్మారి ధాటికి మరో 131మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు ప్రస్తుతం 17.91గా ఉంది.

కేరళలో కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం పినరయి​ విజయన్.. కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో స్థానిక కమిటీలు ఏర్పాటు చేసి వైరస్ తీవ్రతను అంచనా వేయాలని సూచించారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్ సరైన పరిష్కారం కాదన్నారు. దానివల్ల రాష్ట్ర ఆర్థికవ్యవస్థ, ప్రజల జీవనవ్యవస్థ దెబ్బతింటుందని తెలిపారు. ఇప్పటివరకు వ్యాక్సిన్​ మొదటి డోస్ 74శాతం మందికి, రెండోడోసు 27శాతం మందికి అందిచామన్నారు.

వ్యాక్సిన్​ కొరత..

కేరళలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 41లక్షలు దాటింది. మరోవైపు రాష్ట్రంలో వ్యాక్సిన్​ కొరత ఆందోళన కలిగిస్తోందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. టీకా డోసులు అందించాలని కేంద్రానికి తెలిపినట్లు వివరించారు.

ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు..

మహారాష్ట్రలో కొత్తగా 4,313 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. 4,360 మంది కోలుకోగా.. 35 మంది వైరస్​కు బలయ్యారు. మరోవైపు వరుసగా మూడోరోజు ముంబయిలో 400లకు పైగా కేసులు నమోదవడం ఆందోళనకర విషయం.

  • కర్ణాటకలో కొత్తగా 1,220 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,175 మంది వైరస్​ను జయించగా.. 19 మృతిచెందారు.
  • బంగాల్​లో కొత్తగా 686 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మరణించారు. కొత్తగా 715మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు.
  • ఒడిశాలో కొత్తగా 849 మందికి కరోనా సోకింది. వారిలో 120 మంది చిన్నారులు ఉన్నారు. వైరస్ నుంచి కొత్తగా 495 మంది కోలుకున్నారు. మహమ్మారి ధాటికి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

వ్యాక్సినేషన్..

దేశంలో ఇప్పటివరకు 67.65 కోట్ల డోసులు అందించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. శుక్రవారం ఒక్కరోజే 51 లక్షలకుపైగా డోసులు ఇచ్చినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి: ఒకే వ్యక్తికి నిమిషాల వ్యవధిలో రెండు టీకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.