ETV Bharat / bharat

శబరిమల యాత్రకు నూతన మార్గదర్శకాలివే!

author img

By

Published : Nov 9, 2020, 12:59 AM IST

కేరళ వ్యాప్తంగా కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో శబరిమల యాత్ర నిబంధనలను కాస్త కఠినతరం చేసింది కేరళ ప్రభుత్వం. ఇకపై దర్శనానికి 24 గంటల ముందు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది. మండల-మకర సంక్రాంతి సీజన్​లో భాగంగా రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగే యాత్ర.. నవంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.

sabarimala news
శబరిమల యాత్రకు నూతన మార్గదర్శకాలివే!

కేరళలో కొన్నాళ్లపాటు తగ్గిన కరోనా మళ్లీ విశ్వరూపం చూపిస్తోంది. ఆరంభంలో వైరస్‌ వ్యాప్తి నివారణ చర్యలను కట్టుదిట్టం చేయడం వల్ల కేసులు గణనీయంగా తగ్గాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి భారీ సంఖ్యలో కేసులు నమోదవ్వడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత అప్రమత్తమైన ప్రభుత్వం.. కరోనా నిబంధనల్లో మార్పులు చేసింది. ఇందులో భాగంగా ప్రఖ్యాత శబరిమల యాత్రికుల కోసం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది.

మార్గదర్శకాలివే...

  • భక్తులు ముందుగానే కేరళ పోలీస్‌శాఖ అభివృద్ధి చేసిన వర్చువల్‌ క్యూ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. దీని కోసం "https://sabarimalaonline.org" వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • రోజుకు గరిష్ఠంగా 1,000 మంది భక్తులకు అనుమతి ఇస్తారు. పరిస్థితుల ఆధారంగా మార్పులు చేసే అవకాశం.
  • శబరిమలకు వచ్చే భక్తులంతా 24 గంటల ముందు కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవాలి. వైద్య ఫలితాల్లో నెగటివ్​ వచ్చిన వారికే దర్శనానికి అనుమతి. గతంలో 48 గంటల ముందు పరీక్షలు చేయించుకున్నా ఆలయంలోకి అనుమతించేవారు.
  • రాకపోకల సమయాల్లోనూ భక్తులు కచ్చితంగా భౌతిక దూరం పాటించాల్సిందే. ప్రతి 30 నిమిషాలకు శానిటైజర్​తో చేతులు శుభ్రం చేసుకోవాలి.
  • మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేశారు. భక్తులతో పాటు వచ్చే డ్రైవర్లు ఈ నిబంధనలు పాటించాలి.
  • ప్రవేశమార్గంలోనూ యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తారు. వాటిల్లోనూ నెగటివ్​ రావాల్సిందే.
  • ఈ మధ్యకాలంలో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు ఉంటే వారికి ఫిట్​నెస్​ టెస్టు నిర్వహిస్తారు. వారి ఆరోగ్య పరిస్థితిని విచారించి, లక్షణాలు లేకుండా ఫిట్​గా ఉన్నారని ధ్రువీకరించుకున్నాకే ఆలయంలోకి అనుమతి ఇస్తారు.
  • పది సంవత్సరాలలోపు వారికి, 60-65 సంవత్సరాలు దాటిన వారిని దర్శనానికి అనుమతించరు. దీర్ఘకాలిక, గుండె సమస్యలతో బాధపడుతున్న వారు శబరిమల యాత్రకు రాకూడదు.
  • యాత్రకు వచ్చిన వాళ్లు తమతో ఆయుష్మాన్‌ భారత్‌, బీపీఎల్‌ తదితర ఆరోగ్యబీమా కార్డులను వెంటతెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన భక్తులకు కరోనా సోకితే.. వారి కోసం చికిత్స సదుపాయాలు కల్పిస్తున్నారు.
  • స్వామికి నెయ్యి అభిషేకాలు, పంపా నదిలో స్నానాలు సహా సన్నిధానంలో రాత్రి బసచేయడం వంటివాటిని అనుమతించరు.

రెండు నెలల పాటు సుదీర్ఘంగా సాగే శబరిమల యాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభం కానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.