వరకట్న రక్కసిని రూపుమాపాలని కోరుతూ.. కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ బుధవారం నిరాహార దీక్ష చేపట్టారు. ఉదయం 8 గంటలకు ఆయన నివాసంలో ఈ దీక్ష చేపట్టారు. వరకట్న వేధింపులకు వ్యతిరేకంగా వివిధ గాంధేయవాద సంస్థలు ఆయనకు మద్దతుగా దీక్ష చేపట్టాయి. తిరువనంతపురంలోని గాంధీభవన్లో ఈ నిరసనలను ప్రారంభించాయి.
గవర్నర్.. సాయంత్రం 4 గంటలకు ఈ నిరాహార దీక్షను విరమిస్తారు. అనంతరం.. గాంధీభవన్లో నిర్వహిస్తున్న నిరసనల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది.
వరకట్న వేధింపుల కారణంగా ఇటీవల వరుస ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకున్నాయి. పలువురు మహిళల వరకట్న వేధింపులు తాలలేక మృతి చెందటంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు గవర్నర్. వరకట్న సంప్రదాయాన్ని రూపుమాపేందుకు తాను స్వచ్ఛందంగా పనిచేసేందుకు సిద్ధమని గవర్నర్ ప్రకటించారు. ఈ క్రమంలో బుధవారం దీక్ష చేపట్టారు.
ఇదీ చదవండి : 'సైన్యంలో చేరేలా యువతకు అవగాహన కల్పించాలి'