ETV Bharat / bharat

ఆన్​లైన్ స్నేక్ క్యాచర్స్.. ఫొటో తీసి పంపిస్తే పాముల్ని పట్టుకెళ్తారు! - సర్ప యాప్​

పాములను రక్షించడమే లక్ష్యంగా మొబైల్​ యాప్​ను కేరళ ప్రభుత్వ అటవీ శాఖ ఆవిష్కరించింది. సమీపంలో ఎవరికైనా పాము కనిపిస్తే ఫోన్​లో ఫొటో తీసి అప్​లోడ్ చేస్తే.. వాటిని తీసుకెళ్లేందుకు సహాయక సిబ్బంది వచ్చేలా ఈ యాప్ రూపొందించారు.

kerala govt luanched sarppa app
పాముల రక్షణకు కేరళ ప్రభుత్వ మోబైల్​ యాప్
author img

By

Published : Nov 5, 2022, 9:43 PM IST

Updated : Nov 5, 2022, 10:40 PM IST

జనావాసాల్లో తిరిగే పాములను రక్షించడమే లక్ష్యంగా కేరళ ప్రభుత్వ అటవీ శాఖ "సర్ప" అనే మొబైల్​ యాప్​ను ఆవిష్కరించింది. ఎవరికైనా వారి సమీపంలో పాము కనిపిస్తే ఒక్క ఫొటో తీసి ఈ యాప్​లో అప్​లోడ్ చేస్తే స్కేక్ రెస్కూ చేసే తమ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని వాటిని రక్షించనున్నట్లు తెలిపింది.

చాలా మంది పాములకు భయపడి వాటిని చంపుతున్నారని... ఈ ఘటనలను తగ్గించడమే లక్ష్యంగా ఈ యాప్​ రూపొందించినట్లు అధికారులు తెలిపారు. వివిధ రకాల విషపూరిత పాముల ప్రవర్తనను అర్థం చేసుకోవడం, పాముకాటుకు గురైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి యాప్​లో వివరించినట్లు వెల్లడించారు. ప్రాథమిక చికిత్స చేసే విధానం గురించి సైతం సమాచారం ఉందన్నారు.

"అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా మందికి పాములను సురక్షితంగా పట్టడంలో శిక్షణ ఇచ్చాము. మొబైల్​లో ఫోటో తీసి యాప్​లో అప్​లోడ్ చేస్తే దగ్గరలో ఉన్న స్కేక్​ రెస్కూ సిబ్బంది జీపీఎస్​ లోకేషన్​ను అనుసరించి అక్కడికి చేరుకుంటారు. ఒకవేళ ఎవరైన ఫొటోలు తీసి అప్​లోడ్ చేయలేకపోతే స్కేక్ రెస్కూ చేసే వారి ఫోన్​ నంబర్లు యాప్​లో ఉన్నాయని వాటి ద్యారా వారికి సమాచారం అందించవచ్చు" అని అధికారులు తెలిపారు.​

Last Updated : Nov 5, 2022, 10:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.