ETV Bharat / bharat

అజేయుడు ఊమెన్ చాందీ.. 12వ సారి విజయం - కేరళ అసెంబ్లీ ఎన్నికలు

కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్​ సీనియర్​ నేత ఊమెన్​ చాందీ.. రికార్డు విజయం సాధించారు. వరుసగా 12వ సారీ ఒకే నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి గెలిచారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన 77ఏళ్ల చాందీ.. ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా 12 సార్లు గెలుపొందారు. శాసనసభ్యుడిగా ఇటీవల తన 50ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు.

Oomen chandy
కాంగ్రెస్​ సీనియర్​ నేత ఊమెన్​ చాందీ
author img

By

Published : May 2, 2021, 2:57 PM IST

కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఊమెన్‌ చాందీ(77) ఖాతాలో మరో విజయం నమోదైంది. కేరళ శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆయన.. వరుసగా 12 సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అన్నిసార్లూ పూతుపల్లి నియోజకవర్గం నుంచే కావడం విశేషం. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ.. విజయాన్ని అందుకున్నారు. ఆయన ఎన్నడూ పార్టీ మారిందీ లేదు. గత ఏడాది సెప్టెంబరు 17 నాటికి శాసనసభ్యుడిగా చాందీ ఐదు దశాబ్దాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. తాజాగా మరోసారి పూతుపల్లి నుంచి ఎన్నికల బరిలో నిలిచి సత్తా చాటారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి.. తన నిజాయతీ, చిత్తశుద్ధితో పార్టీ అధినాయకత్వానికి విశ్వాసపాత్రుడిగా నిలిచారు. 27 ఏళ్ల వయసులో పూతుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. తర్వాత ఎన్నడూ వెనుదిరిగి చూసుకోలేదు.

ఆదివారమైతే అక్కడే..

పూతుపల్లే తన కార్యక్షేత్రమని, వీలైనంత వరకు ప్రజల మధ్య ఉండటమే తన విజయ రహస్యమని చాందీ వినయంగా చెబుతుంటారు. ఎన్ని పనులున్నా, ఏ హోదాలో ఉన్నా ప్రతి శనివారం రాత్రికి ఆయన పూతుపల్లి చేరుకుంటారు. ఆదివారం అంతా నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. ఐదు దశాబ్దాలుగా దాన్ని ఓ నియమంగా పెట్టుకున్నారు. సీఎంగా ఉన్నప్పుడూ ఇదే పాటించారు. ప్రత్యేక సందర్భాలు మాత్రం అందుకు మినహాయింపు. ప్రజలతో ఈ అవినాభావ సంబంధమే ఆయన్ను ఆదర్శ రాజకీయ నాయకుడిగా తీర్చిదిద్దింది. 2016 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయనపై సౌర కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వచ్చినా జనం విశ్వసించలేదు. అప్పట్లో ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేసినా ఓటర్లు ఆయనకు దన్నుగా నిలిచారు. చాందీ 1977లో కె.కరుణాకరన్‌ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రెండుసార్లు (2004- 2006, 2011- 2016) ముఖ్యమంత్రిగానూ పనిచేశారు.

అభ్యర్థిత్వంపై మొదట్లో ఊగిసలాట

పూతుపల్లిలో ఈ దఫా చాందీ అభ్యర్థిత్వంపై తొలుత కొంత ఊగిసలాట నెలకొంది. ఆయన్ను పార్టీ అధిష్ఠానం నెమోమ్‌ నుంచి బరిలోకి దించనున్నట్లు వార్తలొచ్చాయి. నెమోమ్‌.. రాష్ట్రంలో భాజపా ఖాతాలోని ఏకైక సిట్టింగ్‌ స్థానం. ఈసారి అక్కడ కమలదళం తరఫున కుమ్మనం రాజశేఖరన్‌ పోటీ చేశారు. గతంలో మిజోరాం గవర్నర్‌గా పనిచేసిన ఈ దిగ్గజ నేతను ఎదుర్కోవాలంటే చాందీ లాంటి సీనియర్‌ అవసరమన్న ఉద్దేశంతో.. ఆయన పేరు తెరపైకి వచ్చింది. కానీ పార్టీ శ్రేణుల నిరసనలతో అధినాయకత్వం వెనక్కి తగ్గింది. చాందీకి మళ్లీ పూతుపల్లి టికెట్‌ కేటాయించింది.

లాంఛనంగా..

పూతుపల్లిలో చాందీకి పోటీగా ఎల్‌డీఎఫ్‌ కూటమి తరఫున 31 ఏళ్ల జైక్‌ సి.థామస్‌ను సీపీఎం నిలబెట్టింది. 2016లోనూ ఆయన చాందీపై పోటీచేశారు. భాజపా అభ్యర్థి ఎన్‌.హరి కూడా బరిలో ఉన్నప్పటికీ, ఆయనా ప్రభావం చూపలేకపోయారు. చాందీ, థామస్‌ ఇద్దరూ క్రైస్తవులే. చాందీ ఆర్థడాక్స్, థామస్‌ జాకోబైట్‌ చర్చి వర్గాలకు చెందినవారు. ఈ రెండు వర్గాల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ దఫా చాందీకి చెక్‌ పెట్టడానికి సీపీఎం సర్వశక్తులూ ఒడ్డినా ప్రయోజనం లేకపోయింది. మాజీ సీఎంనే విజయం వరించింది.

ఇదీ చూడండి: కేరళలో కామ్రేడ్ల హవా- యూడీఎఫ్​కు నిరాశ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.