Kerala Covid Cases News : రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేరళ ప్రభుత్వం పేర్కొంది. వైరస్‌ను ఎదుర్కునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పింది. మంగళవారం ఉదయం 8 గంటల వరకు (24 గంటల వ్యవధిలో) 115 కొత్త కేసులు వచ్చినట్లు కేరళ ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 1,749కి చేరినట్లు తెలిపింది. ఈ క్రమంలోనే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్. ఈ మేరకు వివరాలను వెల్లడించారు.
'జినోమ్ సక్వెన్సింగ్కు పంపించాలి'
కరోనా లక్షణాలతో వచ్చిన శాంపిళ్లను జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాలని, కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని సూచించారు. చికిత్సకు అవసరమైన మందులు, సామగ్రి స్టాక్ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. ఇప్పటికే 1,192 ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో డిసెంబర్ 13 నుంచి 16 వరకు ఆన్లైన్ మోక్ డ్రిల్‌ను నిర్వహించామన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి నేతృత్వంలో ఆస్పత్రుల సన్నద్ధతపై మరోసారి సమావేశం నిర్వహిస్తామని ఓ ప్రకటనలో తెలిపారు.
"కొవిడ్ రోగుల చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు, రూములు, ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్స్ ఉండేలా చూసుకోవాలి. విషమంగా లేని రోగులను మెడికల్ కాలేజీలకు పంపించకుండా, స్థానిక ఆస్పత్రుల్లోనే చికిత్స అందిచాలి. కొవిడ్ పాజిటివ్‌గా తేలితే, పరీక్ష చేసిన ఆస్పత్రులోనే వెంటనే చికిత్స అందించాలి. గర్భిణీలు, వృద్ధుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలి. ఆస్పత్రి సిబ్బంది, రోగులు, విజిటర్స్ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి."
--వీణా జార్జ్, కేరళ ఆరోగ్య మంత్రి
రాష్ట్రంలో 1,957 ఆక్సిజన్ బెడ్లు, 2,454 ఐసీయూ బెడ్లు, 937 వెంటిలేటర్ ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసుల్లో ఒక వ్యక్తి తప్ప మిగిలిన వారంతా సాధారణ లక్షణాలతోనే ఉన్నారని చెప్పారు. ఇటీవల కరోనాతో మరణించిన వారందరూ 65 ఏళ్లకు పైబడి, క్యాన్సర్, డయాబెటిస్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారేనని వివరించారు. ఒక వ్యక్తికి మాత్రమే కొవిడ్ ఉపరకం జెఎన్. 1 ఒమిక్రాన్ సోకిందని, అతడు సైతం కొలుకున్నాడని చెప్పారు.
కొత్త కొవిడ్ వేరియంట్ కలవరం- రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Nipah Virus In Kerala : కొవిడ్‌తో పోల్చితే నిఫా చాలా డేంజర్.. ICMR బిగ్ వార్నింగ్!