ETV Bharat / bharat

నవ దంపతుల ఆత్మహత్య.. కరోనా భయమే కారణమా?

కరోనా మహమ్మారి సోకిందనే భయంతో ముంబయిలోని ఓ అపార్ట్​మెంట్​లో నవ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇరువురు కేరళాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఓసారి వైరస్​ బారినపడి వారు మరోమారు కరోనా లక్షణాలు కనిపించటం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు పోలీసులు.

Kerala couple suicide in Mumbai
దంపతుల ఆత్మహత్య
author img

By

Published : Jul 24, 2021, 7:08 PM IST

కరోనా మహమ్మారి ఎంతోమందిని పొట్టనపెట్టుకుంటోంది. ఆర్థిక స్తోమత సరిగా లేక, వైరస్​తో పోరాడలేక కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. అలాంటి ఘటనే ముంబయిలో జరిగింది. కేరళాకు చెందిన నవ దంపతులు కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నారు.

Kerala couple suicide in Mumbai
అజయ్​ కుమార్​, సుజాల పెళ్లినాటి ఫొటో

ఇదీ జరిగింది..

కేరళాకు చెందిన అజయ్​ కుమార్​, సుజాలు 10 నెలల క్రితం వివాహం చేసుకున్నారు. ఉపాధి నిమిత్తం మహారాష్ట్ర ముంబయి లోవర్​ పేరల్​ ప్రాంతంలోని భారత్​ టెక్స్​టైల్​ మిల్​ టవర్​లో నివాసం ఉంటున్నారు. కుమార్​ నావీ ముంబయిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తుండగా.. సుజా ఓ ప్రైవేటు బ్యాంకులో విధులు నిర్వర్తిస్తోంది.

శుక్రవారం ఇంట్లో భార్యభర్తలు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వంట గదిలో భర్త, బాత్​రూమ్​ ముందు భార్య మృతదేహాలను గుర్తించారు. గదిలో సూసైడ్​ నోట్​ లభించిన నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు.

సూసైడ్​ నోట్​ ప్రకారం.. ఇరువురికి ఈ ఏడాది ఏప్రిల్​లో కరోనా వైరస్​ సోకింది. దాంతో వారు సొంత ఊరికి వెళ్లిపోయారు. వైరస్​ నుంచి కోలుకున్నాక తిరిగి ముంబయికి వచ్చారు. అయితే.. ఇటీవల మళ్లీ వైరస్​ బారినపడ్డట్లు లక్షణాలు గుర్తించారు. దాంతో చికిత్సకు ఆర్థిక స్తోమత సరిపోదనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు రాసుకొచ్చారు.

మృతదేహాలను ముంబయిలోని నాయర్​ ఆసుపత్రికి తరలించారు. శవపరీక్ష నివేదిక తర్వాత అసలు కారణం తెలుస్తుందని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాలు వేరు వేరు చోట్ల ఉండటంపై అనుమానిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చూడండి: కొవిడ్​ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.