ETV Bharat / bharat

ఫోన్​​లలో ఆ వీడియోలు- సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు అరెస్ట్ - కేరళ పోలీసులు తాజా వార్తలు

కేరళలో చిన్నారుల అశ్లీల దృశ్యాలను(చైల్డ్​ పోర్నగ్రఫీ)ని వీక్షిస్తున్న28 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చాలా మంది ఐటీ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగులే ఉన్నారు. వారి వద్ద నుంచి ల్యాప్​టాప్​లు, మొబైల్​ ఫోన్​లు, మెమొరీ కార్డులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

kerala police child pornography
చైల్డ్​ పోర్నోగ్రఫీకి వ్యతిరేకంగా కేరళ పోలీసులు
author img

By

Published : Jun 7, 2021, 8:36 PM IST

చిన్నారుల అశ్లీల దృశ్యాల(చైల్డ్​ పోర్నోగ్రఫీ)కి సంబంధించిన కేసులో 28 మందిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో చాలా మంది సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లేనని చెప్పారు. చిన్నారులకు సంబంధించిన అశ్లీల దృశ్యాలను వీక్షించటమే కాకుండా.. ఇతరులకూ వాటిని షేర్ చేస్తున్నారని వెల్లడించారు. చైల్డ్​ పోర్నోగ్రఫీ కట్టడి కోసం చేపట్టిన 'ఆపరేషన్​ పీ-హంట్​ 21.1'లో భాగంగా నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. మొత్తం 370 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

"జిల్లా పోలీసు చీఫ్​ల నేతృత్వంలోని 310 మంది సభ్యుల పోలీసు బృందం ఆదివారం ఉదయం ఈ తనిఖీలు చేపట్టాయి. ఏకకాలంలో కేరళలోని 477 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. నిందితుల వద్ద నుంచి ల్యాప్​టాప్​లు, మొబైల్​ ఫోన్​లు, మెమొరీ కార్డులు సహా మొత్తం 429 పరికరాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ పరికరాల్లో చైల్డ్​ పోర్నోగ్రఫీని వారు భద్రపరిచారు. అరెస్టు చేసిన వారిలో చాలా మంది ఐటీ రంగంలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్నవారే."

-మనోజ్​ అబ్రహమ్​, సైబర్​ డోమ్​ నోడల్​ అధికారి

సంబంధిత చట్టం ప్రకారం చిన్నారులకు సంబంధించిన అశ్లీల కంటెంట్​ను వీక్షించినా, భధ్రపరిచినా, ఇతరులతో పంచుకున్నా నేరమేనని మనోజ్​ అబ్రహమ్​ చెప్పారు. దీనికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.10 లక్షల జరిమానా ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: రోడ్డు పక్కన గంజాయి మొక్కల పెంపకం!

ఇదీ చూడండి: మాట్లాడితే చాలు.. కరోనా ఫలితం వచ్చేస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.