కేరళలో మరోమారు పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమే.. అధికారాన్ని హస్తగతం చేసుకోనున్నట్లు విడుదలైన అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
రిపబ్లిక్- సీఎన్ఎక్స్ సర్వే..
రాష్ట్రంలోని 140 స్థానాలకు ఎల్‌డీఎఫ్ కూటమి.. 72 నుంచి 80 స్థానాల వరకు కైవసం చేసుకోనుందని రిపబ్లిక్- సీఎన్ఎక్స్ అంచనా వేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని.. యూడీఎఫ్ 58 నుంచి 64 స్థానాల్లో గెలుపొందే అవకాశముందని పేర్కొంది. అలాగే... భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమికి కేవలం 1 నుంచి 5 స్థానాలు మాత్రమే దక్కే అవకాశముందని.. రిపబ్లిక్-సీఎన్ఎక్స్ సర్వేలో తేలింది.
పీ- మార్క్..
మరో పోలింగ్ సర్వే సంస్థ... పీ-మార్క్ కూడా అధికారం ఎల్‌డీఎఫ్ కూటమినే వరిస్తుందని అభిప్రాయపడింది. ఎల్‌డీఎఫ్ కూటమి 72 నుంచి 79 స్థానాల్లో.. అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశముందని.. పీ మార్క్ సర్వేలో తేలింది. అటువైపు యూడీఎఫ్ కూటమి 60నుంచి 66 స్థానాలతో సరిపెట్టుకుంటుందని పేర్కొంది. భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏకు మూడు స్థానాలలోపు మాత్రమే విజయం సాధిస్తుందని అంచనా వేసింది.
పోల్ డైరీ..
కేరళ పోల్ డైరీ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ సైతం... పినరయి విజయన్ విజయం సాధిస్తారని పేర్కొంది. ఆయన నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ కూటమి... 77నుంచి 87 స్థానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది. యూడీఎఫ్ 51 నుంచి 61, ఎన్‌డీఏ 2నుంచి 3స్థానాల్లో విజయం సాధిస్తాయని అంచనా వేసింది.
యాక్సిస్ మై ఇండియా
యాక్సిస్ మై ఇండియా నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎల్‌డీఎఫ్ కూటమి 104 నుంచి 120 స్థానాల్లో గెలుపొందనుందని తేలింది. యూడీఎఫ్.. 20-36 స్థానాలకు మాత్రమే పరిమితం కానుందన్న యాక్సిస్ సర్వే.. భాజపా మాత్రం సున్న నుంచి రెండు స్థానాలకు మాత్రమే పరిమితమౌతుందని అంచనా వేసింది. ఇండియా టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్‌లో ఎల్‌డీఎఫ్ 104 నుంచి 120 స్థానాల్లో. విజయం సాధిస్తుందని తేలింది. యూడీఎఫ్ 20నుంచి 36 స్తానాల్లో గెలుస్తుందని అంచనా వేసింది.
ఇదీ చూడండి: విజయన్‌పై మురళీధరన్ ఘాటు వ్యాఖ్యలు