లక్షద్వీప్ పాలనాధికారిగా ప్రఫుల్ ఖోడా పటేల్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ కేరళ అసెంబ్లీ తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రఫుల్ ప్రవేశ పెట్టిన పలు వివాదాస్పద సంస్కరణలను కూడా రద్దు చేయాలని పేర్కొంది. దీనికి ప్రతిపక్షాలు మద్దతు తెలిపాయి. లక్షద్వీప్ ప్రజల జీవితాలు, జీవనోపాధులకు రక్షణ కల్పించే విధంగా కేంద్రం తక్షణం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పేర్కొంది.
దమణ్, దీవ్లకు పాలనాధికారిగా ఉన్న ప్రఫుల్‌కు లక్షద్వీప్ బాధ్యతలు అప్పగించింది కేంద్రం. ఈయన రాకతో ఇక్కడ సమస్యలు మొదలైనట్టు తెలుస్తోంది. ప్రఫుల్ ప్రవేశపెట్టిన పలు సంస్కరణలు లక్షద్వీప్ వాసుల్లో అసంతృప్తి రగిలించాయని సమాచారం.
ఇదీ చదవండి : ఆయన సరైనోడే.. కానీ పార్టీ..?