ETV Bharat / bharat

9 నెలల పసికందును చంపి.. గొంతు కోసుకున్న తండ్రి! - kerala news

ముక్కుపచ్చలారని 9 నెలల పసికందును పొట్టనపెట్టుకున్నాడో తండ్రి. ఆపై తానూ పదునైన ఆయుధంతో గొంతు కోసుకొని చనిపోయాడు.

Man hacks to death 9-month-old son
9 నెలల పసికందును చంపి
author img

By

Published : Sep 24, 2021, 5:07 PM IST

కేరళ శ్రీకందపురంలో దారుణం జరిగింది. 9 నెలల పసికందును హతమార్చాడు ఓ దుర్మార్గపు తండ్రి. మెడ వెనుక భాగంలో పదునైన ఆయుధంతో కొట్టి హత్య చేశాడు 31 ఏళ్ల సతీషన్​. తర్వాత.. అతడు కూడా గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

చిన్నారిని కాపాడే ప్రయత్నంలో నిందితుడి భార్య అంజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంజు అరుపులతో ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు.. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు పోలీసులు. దాడికి పాల్పడే ముందు.. నిందితుడు తన తల్లిని ఒక గదిలో పెట్టి తాళం వేసినట్లు చెప్పారు.

Man hacks to death 9-month-old son before killing self
భార్య అంజుతో నిందితుడు సతీషన్​

సతీషన్​ కొద్దిరోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం దారుణానికి ఒడిగట్టాడని అనుమానిస్తున్నారు.

ఇవీ చూడండి: ప్రియురాలిని కత్తితో పొడిచి.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం

కుమార్తెనే గర్భవతిని చేసిన తండ్రి.. అబార్షన్​కు ఒప్పుకోలేదని...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.