ఏప్రిల్ 6న కేరళ శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ నామినేషన్ దాఖలు చేశారు. ధర్మదామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న ఆయన.. కన్నూర్‌లో నామపత్రాలు సపర్పించారు. దర్మధామ్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయడం ఇది రెండోసారి.
ఉదయం 11 గంటలకు కన్నూర్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్న విజయన్.. చేతులకు గ్లవ్స్, ముఖానికి మాస్క్‌తో పాటు ఫేస్షీల్డ్ని ధరించారు. ఆయన వెంట.. కన్నూర్ జిల్లా సీపీఎం కార్యదర్శి ఎంవీ జయరాజన్ ఉన్నారు.
140అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న కేరళలో ఏప్రిల్ 6న(ఒకే దశలో) ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: కేరళ ఎన్నికలు: సీపీఎం తొలి జాబితా విడుదల