Kashmir Encounter: Kashmir Encounter: జమ్ము కశ్మీర్లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్(జేఈఎం) కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడు.
కశ్మీర్లోని బుడ్గాం జిల్లాలోని చరర్ ఐ షరీఫ్ ప్రాంతంలో, పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
"కశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ దాదాపు 12 గంటలపాటు జరిగింది." అని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.
"ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు ముష్కరులు హతమయ్యారు. ఘటనాస్థలి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, ఏకే-56 తుపాకులను స్వాధీనం చేసుకున్నాం. ఉగ్రవాదులు జేఈఎం, ఎల్ఈటీ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారుగా గుర్తించాం. మృతుల్లో జేఈఎం కమాండర్ జాహిద్ వానీ ఉన్నాడు. ఇదో పెద్ద విజయం మాకు." అని కశ్మీర్ జోన్ పోలీస్ ట్వీట్ చేసింది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి: 'నేరగాళ్లను పోటీ చేయనీయొద్దు'