ETV Bharat / bharat

'మా చెరువు పోయింది.. కాస్త వెతికి పెట్టండి' - చెరువుపై ఫిర్యాదు

కారు పోయింది. బంగారం పోయింది, డబ్బులు పోయాయి. లాంటి ఫిర్యాదులను మనం విన్నాం. చూశాం. కానీ, ఓ చోట ఏకంగా చెరువే పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు కొంతమంది. చెరువును కొట్టేయడమేంటి? అదెలా సాధ్యం? అని అనకుంటున్నారా? అయితే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..

lake missing
చెరువు ఆక్రమణ
author img

By

Published : Jul 10, 2021, 6:56 PM IST

Updated : Jul 10, 2021, 7:19 PM IST

ఆక్రమణకు గురైన మారనగెరె చెరువు

కర్ణాటక తుముకూరు​ జిల్లా గుబ్బి పోలీస్​ స్టేషన్​లో ఓ వింత కేసు నమోదైంది. ' మా చెరువు పోయింది. దయచేసి వెతికిపెట్టండి' అని కొంతమంది సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ చెరువును వెతికేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

చెరువు ఎలా పోయిందంటే..?

గుబ్బి పట్టణం సమీపంలో మారనగెరె అనే గ్రామం ఉంది. అక్కడే సర్వే నంబర్​ 17లో 46 ఎకరాల విస్తీర్ణంలో ఓ చెరువు ఉంది. కానీ, ఆ చెరువు కాస్త రానురానూ ఆక్రమణకు గురై కనుమరుగై పోయే స్థితికి చేరింది. అయితే.. ఆ చెరువును ఆక్రమించుకుంది ప్రభుత్వమే కావడం గమనార్హం.

lake missing
చెరువు పోయిందని పోలీసులకు ఫిర్యాదు
lake missing
సర్వే నంబర్​ 17లో ఉన్న మారనగెరె చెరువు

చెరువు ఉన్న ప్రాంతంలో సంవత్సరానికి ఒకటి చొప్పున ప్రభుత్వ బిల్డింగులను నిర్మిస్తూ వస్తున్నారు. 1998 నుంచి ఇప్పటివరకు ఆ చెరువు అంతా ప్రభుత్వ భవంతులు, అసోసియేషన్ సొసైటీలు, వివిధ కమ్యూనిటీ హాళ్లతో నిండిపోయింది. 1998లో మొదటిసారి రెండు ఎకరాల భూమిని ఒకాలిగా అనే సామాజిక వర్గానికి, వీర శైవ కమ్యూనిటికి, విద్యా శాఖకు కేటాయించారు.

lake missing
మారనెగెరె చెరువులో భవనాలు
lake missing
చెరువులో నిర్మించిన ప్రభుత్వ భవనాలు

1998లోనే మరో 20 గుంటలను యాదవ కమ్యూనిటీ, ప్రభుత్వ ఉద్యోగుల యూనియన్​, గవర్నమెంట్​ ఫస్ట్ క్లాస్​ కళాశాల​, ఎస్సీ-ఎస్టీ హాస్టల్​, హేమావతి శాఖ సహా ఎన్నో ఇతర బిల్డింగులు కడుతూ వచ్చారు. అంతకుముందు గుబ్బి పట్ణణంలో కురిసిన వర్షపు నీరంతా ఈ చెరువులోనే చేరేది. కానీ, ఇప్పుడు వర్షం కురిస్తే నీరంతా పట్టణ వీధుల్లోనే ఉండిపోతోంది. మరోవైపు చెరువు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ బిల్డింగులన్నీ నీటిలో మునిగిపోతున్నాయి.

ఈ చెరువును కాపాడాలని మూడేళ్లుగా స్థానికులు పోరాడుతున్నారు. గ్రామస్థుల డిమాండ్​తో ప్రస్తుతం ఈ చెరువు ప్రాంతాన్ని సర్వే చేసేందుకు తాలుకా యంత్రాంగం సిద్ధమవుతోంది.

ఇదీ చూడండి: శబ్దాలు చేస్తే రూ.లక్ష జరిమానా!

ఇదీ చూడండి: 'మూడో దశ ముందే వచ్చాం.. భయమెందుకు?'

Last Updated : Jul 10, 2021, 7:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.