ETV Bharat / bharat

'లంచం ఇవ్వు.. లేదంటే కోరిక తీర్చు'.. అబలపై పోలీసు దుర్బుద్ధి - police inspector bangalore woman

Inspector asking woman to have sex: ఓ కేసులో పోలీస్ స్టేషన్​ను ఆశ్రయించిన మహిళను ఇన్​స్పెక్టర్ వేధింపులకు గురి చేశాడు. సమస్య పరిష్కరించాలంటే లంచం ఇవ్వాలని, లేదంటే తన కోరిక తీర్చాలని డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారంపై కమిషనర్​కు ఫిర్యాదు చేశారు బాధిత మహిళ.

inspector vasanth kumar
karnataka crime news
author img

By

Published : Jan 20, 2022, 2:29 PM IST

Inspector asking woman to have sex: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసు.. ఓ మహిళ(39) పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఇస్తే లంచం ఇవ్వాలని, లేదంటే తన లైంగిక వాంఛ తీర్చాలని తన దుర్బుద్ధి చాటుకున్నాడు. కర్ణాటకలోని బెంగళూరులో ఈ ఘటన జరిగింది.

Bengaluru woman complaint on Inspector

బెంగళూరులోని హెన్నూర్ పోలీస్ స్టేషన్​లో ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తున్న వసంత్ కుమార్​పై ఓ మహిళ ఈ ఆరోపణలు చేశారు. తన ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిపై ఫిర్యాదు చేసేందుకు జనవరి 13న పోలీస్ స్టేషన్​కు వెళ్లినట్లు ఆమె చెప్పారు. తన పరిస్థితిని ఆసరాగా తీసుకొని పోలీస్ ఇన్​స్పెక్టర్ అభ్యంతరకరంగా మాట్లాడాడని బాధితురాలు పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీస్ కమిషనర్​కు ఫిర్యాదు లేఖ పంపించారు.

"నా ఇంట్లో అద్దెకు ఉంటున్న కుటుంబం నాపై దాడి చేసింది. నాకు స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి. దీనిపై పోలీస్ స్టేషన్​కు వెళ్తే నా ఫిర్యాదు నమోదు చేసుకోలేదు. తర్వాత ఇన్​స్పెక్టర్ వసంత్ కుమార్ తన ఛాంబర్​లోకి పిలిచి రెండు ఆప్షన్​లు ఇచ్చాడు. రూ.5 లక్షలు ఇవ్వాలని, లేదంటే తాను అడిగినప్పుడల్లా లైంగిక వాంఛ తీర్చాలని అడిగాడు. ఈ డిమాండ్లకు ఒప్పుకుంటేనే సహాయం చేస్తానని చెప్పాడు. నేను ఇందుకు ఒప్పుకోలేదని.. నాతో దుర్భాషలాడాడు. నాపై కనీసం 20 పోలీస్ కంప్లైంట్​లు నమోదయ్యేలా చూస్తానని బెదిరించాడు. ఓ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశాడు. అతి కష్టం మీద ఆ కేసులో బెయిల్ వచ్చింది."

-బాధిత మహిళ

బెయిల్ లభించిన తర్వాత కూడా తనను ఇన్​స్పెక్టర్.. తన స్టేషన్​కు పిలిచి వేధింపులకు గురి చేశాడని బాధిత మహిళ వివరించారు. తన డిమాండ్లను అంగీకరించాలని ఒత్తిడి చేసేవాడని చెప్పారు. దీని వల్ల.. తాను తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నట్లు కమిషనర్​కు ఇచ్చిన ఫిర్యాదులో తన గోడు చెప్పుకున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: గర్భంతో ఉన్న ఫారెస్ట్ గార్డ్​పై మాజీ సర్పంచ్ దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.