ETV Bharat / bharat

కర్ణాటక బీజేపీ అధ్యక్షుడిగా విజయేంద్ర- పంతం నెగ్గించుకున్న యడ్డీ! - బీవై విజయేంద్ర పొలిటకల్ కెరీర్

Karnataka New BJP President : కర్ణాటక బీజేపీ చీఫ్​గా యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర నియమితులయ్యారు. నళిన్ కుమార్ కటీల్​ స్థానంలో విజయేంద్రను పార్టీ చీఫ్​గా నియమించింది బీజేపీ అధిష్ఠానం.

karnataka new bjp president
karnataka new bjp president
author img

By PTI

Published : Nov 10, 2023, 10:12 PM IST

Updated : Nov 10, 2023, 10:32 PM IST

Karnataka New BJP President : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన భారతీయ జనతా పార్టీ.. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చింది. బీజేపీ కర్ణాటక విభాగం అధ్యక్షుడిగా పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్రను నియమించింది. 2020 నుంచి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతల్లో ఉన్న విజయేంద్ర.. అధ్యక్షుడి స్థానంలో ఉన్న నళిన్‌కుమార్‌ కటీల్‌ను భర్తీ చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చుతారనే ఊహాగానాలకు దీంతో తెరపడినట్లైంది.

BY Vijayendra Political Career :
గత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీవై విజయేంద్ర తన తండ్రి యడియూరప్ప సిట్టింగ్ సీటైన శికారీపుర నియోజక నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. న్యాయవిద్య పూర్తి చేసిన విజయేంద్ర.. గతంలో భారతీయ జనతా యువ మోర్చా జనరల్‌ సెక్రెటరీగానూ పనిచేశారు. కర్ణాటకలో బీజేపీపై లింగాయత్‌ నేత యడియూరప్ప ప్రభావాన్ని అధిష్ఠానం అంగీకరిస్తోందనేదానికి ఈ నిర్ణయమే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయేంద్ర నియామకం.. యడియూరప్పకు రాజకీయ వారసత్వంగా పరిగణిస్తున్నారు. యడియూరప్ప పెద్ద కుమారుడు బీవై రాఘవేంద్ర ప్రస్తుతం శివమొగ్గ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు.

అధిష్ఠానానికి ధన్యవాదాలు..
కర్ణాటక బీజేపీ ఛీప్​గా తనను నియమించడంపై స్పందించారు బీవై విజయేంద్ర. పార్టీ కార్యకర్తగా తనకు అధ్యక్ష బాధ్యతలను అధిష్ఠానం అప్పగించిందని అన్నారు. కేవలం తాను బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప కుమారుడినని పార్టీ పగ్గాలు అప్పజెప్పలేదని విజయేంద్ర తెలిపారు.

  • VIDEO | "I would like to thank our national president JP Nadda for giving me the opportunity to serve as president of BJP in Karnataka. I would also like to thank PM Modi and Amit Shah for reposing faith in me. Our main aim will be to ensure that party wins maximum number of Lok… pic.twitter.com/4wYtQCDqza

    — Press Trust of India (@PTI_News) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసిన పార్టీ అధిష్ఠానానికి ధన్యవాదాలు. బీఎస్‌ యడియూరప్పతో సహా పలువురు నాయకులు, లక్షలాది మంది కార్యకర్తల కృషి వల్లే కర్ణాటకలో బీజేపీ ఈ స్థాయికి ఎదిగింది. కేంద్ర, రాష్ట్ర నాయకుల మార్గదర్శకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందడమే బీజేపీ ముందున్న ఏకైక లక్ష్యం." అని బీవై విజయేంద్ర తెలిపారు. అలాగే బీజేపీ చీఫ్​గా నియామకం జరిగిన తర్వాత తన తండ్రి యడియూరప్పను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు బీవై విజయేంద్ర.

  • #WATCH | Bengaluru: Former Karnataka CM and BJP leader BS Yediyurappa congratulates son BY Vijayendra Yediyurappa after he was appointed as the party president for Karnataka. pic.twitter.com/b93lMQnNrg

    — ANI (@ANI) November 10, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • PHOTOS | BJP MLA Vijayendra Yediyurappa meets his father and former Karnataka CM B S Yediyurappa after getting appointed as president of state BJP unit. pic.twitter.com/SpZsvYytTo

12 ఏళ్ల వయసులో యాసిడ్​ దాడి- 37 ఆపరేషన్లు, ఆరేళ్లు ఆస్పత్రిలో నరకం- ఇప్పుడీ ప్రొఫెసర్​ 'స్వరకోకిల'

పక్షుల కోసం దీపావళి ఆనందం త్యాగం- 50 ఏళ్లుగా ఆ ఊర్లో ఇంతే!

Last Updated : Nov 10, 2023, 10:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.