ETV Bharat / bharat

చిన్న వయసులోనే పెళ్లి- ఆ బాలిక ఏం చేసిందంటే? - ఇంటి నుంచి పారిపోయిన బాలిక

నడిరోడ్డుపై, అర్ధరాత్రి పూట ఓ బాలిక బిక్కచూపులు చూస్తూ నిల్చుంది. ఆమెను గమనించిన స్థానికులు ఏం జరిగిందని ప్రశ్నించారు. ఆమెకు జరిగిన అన్యాయం తెలుసుకుని అధికారుల వద్దకు పంపించారు. ఇంతకీ ఏమైందంటే..?

girl left home
ఇంట్లో నుంచి పారిపోయిన బాలిక
author img

By

Published : Jul 16, 2021, 11:23 AM IST

ఆడుతూ పాడుతూ, చదువుకోవాల్సిన వయసులో ఆ బాలికకు పెళ్లి చేశారు. అత్తారింటికి పంపించారు. భర్త వద్ద బందీగా మార్చారు. ఎలాగైనా సరే ఆ చెర నుంచి తప్పించుకోవాలనుకున్న ఆమె.. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టింది. కానీ, ఎటు వెళ్లాలో తెలియక నడిరోడ్డులో నిల్చుండిపోయింది. ఈ సంఘటన కర్ణాటక కోలార్​ జిల్లా హలేపాల్యా గ్రామంలో జరిగింది.

వారం క్రితమే..

సదరు బాలికకు ఓ వ్యక్తితో వారం క్రితమే పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు. ఈ వివాహం ఏ మాత్రం నచ్చని ఆ బాలిక.. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. జాతీయ రహదారి 75పై నంగోలీ వద్ద ఒంటరిగా నిల్చున్న ఆ బాలికను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని అంబేద్కర్​ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సందేశ్​కు తెలియజేశారు.

girl left home
బాలికతో మాట్లాడుతున్న అధికారులు

సందేశ్​ ఆ ప్రాంతానికి చేరుకుని.. ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమెను మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల వద్దకు పంపించారు. తన తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్లి చేసినందునే.. ఇంటి నుంచి బయటకు వచ్చానని అధికారుల ముందు వాపోయిందా బాలిక. చిన్నవయసులో వివాహం చేసినందుకు ఆమె తల్లిదండ్రులపై చర్యలు తీసుకోనున్నారు అధికారులు.

ఇదీ చూడండి: అక్కాచెల్లెళ్ల ఘనత- ఒకేసారి ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగం

ఇదీ చూడండి: మోదీ డిబ్బీ.. రూ.లక్ష దాయొచ్చట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.