ETV Bharat / bharat

'అయ్యా మోదీ గారూ.. కమీషన్లు ఇవ్వలేను.. చనిపోయేందుకు అనుమతించండి!'

రెండేళ్ల పాటు కొవిడ్​-19 సంబంధిత పరికరాలను రెండు గ్రామాలకు సరఫరా చేశాడు ఓ కాంట్రాక్టర్​. అందుకు సంబంధించిన బిల్లులు ఇంతవరకు పాస్ కాలేదు. నిధులు మంజూరు​ చేయాలంటే 40 శాతం కమీషన్​ కావాలని అధికారులు డిమాండ్​ చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక.. కారుణ్య మరణానికి అనుమతించాలని రాష్ట్రపతి, ప్రధానికి ఆ కాంట్రాక్టర్​ లేఖ రాశాడు. అసలేం జరిగింది? రావాల్సిన బిల్లులు ఎంత?

A contractor who sought euthanasia
A contractor who sought euthanasia
author img

By

Published : Oct 31, 2022, 3:25 PM IST

Karnataka Contractor Euthanasia : కర్ణాటక హుబ్లీకి చెందిన ఓ కాంట్రాక్టర్‌.. కారుణ్య మరణానికి అనుమతి కోరాడు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకు లేఖ రాశాడు. ఇక్కడి అధికారులు అడిగినంత కమీషన్లు ఇచ్చుకోలేకపోతున్నానని, తనకు మరణమే శరణ్యమని లేఖలో పేర్కొన్నాడు. తనకు రావాల్సిన బిల్లులను క్లియర్‌ చేసేందుకు అధికారులు ఏకంగా 40 శాతం కమీషన్ డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించాడు.

చిక్కమగళూరు జిల్లాలోని కడూరు, మూడిగెరె గ్రామ పంచాయతీలకు కొవిడ్-19 సంబంధిత పరికరాలను సరఫరా చేశానని కాంట్రాక్టర్‌ బసవరాజ్‌ మోదీతో పాటు ఇతర ప్రముఖులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. ఇందుకు తనకు చెల్లింపులు జరపకుండా అధికారులు కావాలనే జాప్యం చేస్తున్నారని చెప్పాడు. దాదాపు రూ.1.12 కోట్ల బిల్లులను పాస్ చేయడానికి 40 శాతానికంటే ఎక్కువ కమీషన్ ఇవ్వాలని అధికారులు డిమాండ్‌ చేస్తున్నారని తెలిపాడు.

A contractor who sought euthanasia
కారుణ్య మరణానికి అనుమతించాలని రాష్ట్రపతికి రాసిన లేఖ

పరికరాలు సరఫరా చేసి రెండేళ్లు కావొస్తున్నా బిల్లులు పాస్‌ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు బసవరాజ్. గతంలో తన ఫిర్యాదు మేరకు బిల్లులు పాస్‌ చేయాలని పీఎంఓ, సీఎంఓ అధికారులు పలుమార్లు పంచాయతీ అధికారికి సూచించినా ఫలితం లేదని వాపోయాడు. అందుకే గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్లు లేఖలో పేర్కొన్నాడు.
కొన్ని నెలల క్రితం ఇలాంటి ఘటనే కర్ణాటకలో కలకలం రేపింది. మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై ఆరోపణలు చేసిన ఓ కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి:

శరద్​ పవార్​కు అనారోగ్యం​.. ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స.. ఏం జరిగింది?

రేప్ కేసుల్లో 'టూ ఫింగర్ టెస్టు'లపై సుప్రీం సీరియస్.. ఆధార్-ఓటర్ ఐడీ లింక్​పై నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.