ETV Bharat / bharat

పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం.. చిన్నారి సహా నలుగురు మృతి.. కూలీకి వెళ్లి వస్తూ ఏడుగురు మహిళలు.. - ఉత్తర్​ప్రదేశ్​ రోడ్డు ప్రమాదం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పని ముగించుకుని.. ఇంటికి తిరిగి వెళ్తున్న కూలీల ఆటోను ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మహిళలతో పాటు.. 11 మంది గాయపడ్డారు. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన మరో ఘటనలో కారు బోల్తాపడి నాలుగేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు.

karnataka road accident
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Nov 5, 2022, 12:23 PM IST

Updated : Nov 5, 2022, 1:18 PM IST

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్‌ జిల్లా చిత్తగుప్ప గ్రామంలో ట్రక్‌-ఆటో ఢీకొని ఏడుగురు మహిళలు మృతిచెందగా.. మరో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. కూలీలు పని ముగించుకుని ఆటోలో తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లి కుటుంబంలో విషాదం
ఉత్తర్​ప్రదేశ్​ మధురలో విషాదం జరిగింది. వివాహ వేడుకలు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. నవ దంపతులు ప్రయాణిస్తున్న కారు.. మరో వాహనాన్ని ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారితో సహా నలుగురు మృతి చెందారు. నవ దంపతులతో సహా మరొకరికి గాయాలయ్యాయి. మృతులకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో.. పెళ్లి చేసుకుని తమ కుటుంబంతో కలిసి నొయిడా నుంచి మధురకు వెళ్తున్నారు. యమునా ఎక్స్​ప్రెస్​ హైవేపై వారు ప్రయాణిస్తున్న కారు మరో వాహనాన్ని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వరుడి తండ్రి చంద్రపాల్ సింగ్, దిగంబర్ సింగ్ అనే మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. నాలుగేళ్ల చిన్నారి ప్రియాంషి, హరేంద్ర అనే వ్యక్తి.. శనివారం ఆస్పత్రిలో మృతి చెందినట్లు సురీర్​ పోలీస్​ అధికారి సంజయ్​ త్యాగి తెలిపారు.

ఇవీ చదవండి:

పంచాయితీకి పిలిపించి మహిళపై కౌన్సిలర్​ గ్యాంగ్​రేప్​​​.. ఏడో తరగతి విద్యార్థిపై కాల్పులు!

ఆస్పత్రిలో బ్రిటిష్ కాలం నాటి సొరంగ మార్గం.. ఎక్కడి వరకు ఉందో తెలుసా?

Last Updated : Nov 5, 2022, 1:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.