ETV Bharat / bharat

బాలికపై సామూహిక అత్యాచారం- 10గంటల్లోనే పట్టుకున్న పోలీసులు - బెళగావి అత్యాచారం వార్తలు

ఒంటరిగా వెళ్తున్న 15ఏళ్ల బాలికను వెంబడించి అత్యాచారానికి (minor gangrape) ఒడిగట్టారు దుండుగులు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు. కర్ణాటకలోని మైసూర్​ గ్యాంగ్​రేప్​ ఘటన దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలోనే బెళగావిలో ఈ దారుణం వెలుగులోకి రావడం గమనార్హం.

minor gangrape
మైనర్​పై సామూహిక అత్యాచారం
author img

By

Published : Aug 27, 2021, 8:08 PM IST

ఓ వైపు మైసూర్​ గ్యాంగ్​రేప్​ ఘటన దర్యాప్తు కొనసాగుతుండగానే కర్ణాటకలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. బెళగావిలో 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన 10 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.

ఏం జరిగిందంటే?

ఘటప్రభ పోలీసు స్టేషన్​ పరిధిలోని గోకక్​ తాలుకాలో ఈ ఘటన జరిగింది. వ్యవసాయ క్షేత్రానికి ఒంటరిగా వెళుతున్న బాలికను ఆమె గ్రామానికే చెందిన నలుగురు వ్యక్తులు వెంబడించారు. అనంతరం నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.

ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే బాలికను చంపేస్తామని బెదిరించారు దుండుగులు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం ఆ బాలిక ఆసుపత్రిలో చేరింది.

ఘటప్రభ పోలీసులకు బాధితురాలి కుటుంబసభ్యులు గురువారం ఫిర్యాదు చేయడం వల్ల ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక కోలుకున్న అనంతరం వారు ఠాణాకు వచ్చారు. వారి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు.. నిందితుల కోసం ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో 10 గంటల్లోనే వారిని అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: rape attempt: తాతయ్య లాంటి వాళ్లే కదా అని పిలిస్తే వెళ్లింది...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.