ETV Bharat / bharat

Dharwad SDM Covid: ఆ కళాశాలలో మరో 99 మంది విద్యార్థులకు కరోనా​ - ధార్వాడ్ కాలేజీలో కరోనా

Dharwad SDM College Covid: కర్ణాటకలోని వైద్యకళాశాలలో కరోనా వైరస్ బారిన పడ్డ విద్యార్థుల సంఖ్య 281కు చేరింది. తాజాగా 99 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ధార్వాడ్​ జిల్లా కలెక్టర్ తెలిపారు. విద్యార్థులందరినీ క్వారంటైన్​కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.

Dharwad SDM College Covid
కర్ణాటకలోని వైద్యకళాశాల
author img

By

Published : Nov 27, 2021, 12:32 PM IST

Dharwad SDM College Covid News: కర్ణాటక ధార్వాడ్​లోని ఎస్​డీఎమ్ వైద్య కళాశాలలో కొవిడ్​-19 బారిన పడిన విద్యార్థుల సంఖ్య 281కు చేరింది. కొత్తగా 99 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ధార్వాడ్ జిల్లా కలెక్టర్ నితీశ్​ పాటిల్ తెలిపారు. ఇంకా 1,822 శాంపిల్స్​ ఫలితాలు రావాల్సి ఉందన్నారు.

కరోనా నిర్ధరణ అయిన 281 మందిలో కేవలం ఆరుగురిలో మాత్రమే కొవిడ్​ లక్షణాలు కనిపించాయని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అయితే వీరందరూ పూర్తిగా టీకాలు వేసుకున్న వారేనని వివరించారు. విద్యార్థులందరినీ క్వారంటైన్​కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.

ఫ్రెషర్స్​ పార్టీతోనే..

కాలేజీలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్​ కె. పాటిల్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు.

విద్యార్థుల శాంపిల్స్​ను జీనోమ్ సీక్వెన్​సింగ్ కోసం పంపించారు. ఇప్పటికే క్యాంపస్​లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేశారు అధికారులు.

Covid-19 karnataka: మరోవైపు కర్ణాటకలో కొత్తగా 402 కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి ధాటికి మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,611 యాక్టివ్​ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇదీ చూడండి: ఆ పాఠశాలలో 33మంది విద్యార్థులు, టీచర్​కు కరోనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.