Kargil Blast Today : కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లోని కార్గిల్ జిల్లాలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పదకొండు మంది గాయపడ్డారు. స్క్రాప్ డీలర్ దుకాణం వద్ద శుక్రవారం ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం గాయపడ్డవారు ద్రాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ద్రాస్ పట్టణం కబాడీలో ఉన్న స్క్రాప్ డీలర్ షాప్‌లో ఓ అనుమానాస్పద వస్తువు పేలుడుకు గురైందని అధికారులు వెల్లడించారు. ఘటనలో ఓ స్థానికేతరుడు మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు.
ఉగ్రముఠాలను అరెస్ట్ చేసిన భద్రతాదళాలు..
Terrorists Arrested Jammu Kashmir : జమ్ముకశ్మీర్‌లో ఆయుధాల అక్రమ రవాణా చేస్తున్న లష్కరే-తొయిబాకు చెందిన రెండు ఉగ్రముఠాలను భద్రతాదళాలు అరెస్ట్ చేశాయి. బారాముల్లా జిల్లా ఉరిలో 8మంది లష్కరే సభ్యుల అరెస్ట్‌తోపాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. వారిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం, ఆయుధ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు సీనియర్ సూపరింటెండెంట్ పోలీసు-SSP అమోద్ నాగ్‌పుర్ తెలిపారు.
-
#WATCH | Eight terrorists arrested with arms & ammunition by Security Forces in Jammu & Kashmir. pic.twitter.com/ITG3l6pTBM
— ANI (@ANI) August 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Eight terrorists arrested with arms & ammunition by Security Forces in Jammu & Kashmir. pic.twitter.com/ITG3l6pTBM
— ANI (@ANI) August 18, 2023#WATCH | Eight terrorists arrested with arms & ammunition by Security Forces in Jammu & Kashmir. pic.twitter.com/ITG3l6pTBM
— ANI (@ANI) August 18, 2023
అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి.. అరెస్ట్ చేసిన పోలీసులు..
Terrorist Arrested in Kashmir : ఆగస్ఠు 8న ఉరిలోని చురుండా ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న భద్రతాదళాలు.. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని గుర్తించినట్లు చెప్పారు. ముష్కరుడు తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. భద్రతా దళాలు చాకచక్యంతో పట్టుకున్నట్లు వెల్లడించారు. అతని వద్ద రెండు గ్రెనేడ్లు లభించినట్లు పేర్కొన్నారు. అతడ్ని కస్టడీలోకి తీసుకొని విచారణ జరపగా.. మరో ఇద్దరి పేర్లు వెల్లడించినట్లు భద్రతా దళాలు వివరించాయి. వారిద్దరూ ఇచ్చిన సమాచారం ఆధారంగా.. రెండు గ్రెనేడ్లు, చైనా పిస్టోల్ మ్యాగజైన్, నాలుగు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు.
నాకాబందీలో ఐదుగురి అరెస్ట్..
ఆగస్టు 11న నాకాబందీ నిర్వహిస్తున్న భద్రతాదళాలు ఓ వాహనాన్ని ఆపినట్లు అధికారులు చెప్పారు. డ్రైవర్‌సహా ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించటం వల్ల భద్రతాదళాలు తనిఖీ నిర్వహించాయని వెల్లడించారు. వారి నుంచి నాలుగు గ్రెనేడ్లు, రెండు పిస్టోళ్లు, రెండు పిస్టోల్ మ్యాగజైన్లు, 10 రౌండ్ల బుల్లెట్లు, 50వేల నగదు లభించినట్లు పోలీసు అధికారి వివరించారు.
'మాయా అద్దం'.. మోసపోయిన 72 ఏళ్ల వృద్ధుడు.. వారిని నగ్నంగా చూడొచ్చని రూ.9 లక్షలు వసూలు