ETV Bharat / bharat

కొబ్బరి చెట్టే అక్కడి తీరప్రాంత రైతులకు కామధేను!

కన్నడ నాట కొబ్బరి చెట్లే కల్పవృక్షమని పిలుచుకుంటారు. ఈ చెట్లే రైతులకు లక్షలు సంపాదించిపెడుతున్నాయి. ఆ చెట్టే ఇప్పుడు తీరప్రాంత రైతులకు కామధేనుగా మారింది. మరి ఆ చెట్ల నుంచి రైతులకు అంత ఆదాయం ఎలా వస్తుందో తెలుసా?

coconut tree
కొబ్బరి చెట్టు
author img

By

Published : Apr 28, 2021, 10:44 AM IST

కొబ్బరి చెట్టే కల్పతరువు

కన్నడ నాట కొబ్బరి చెట్టును కల్పవృక్షమని పిలుచుకుంటారు. ఆ చెట్టే ఇప్పుడు తీరప్రాంత రైతులకు కామధేనుగా మారింది. 8 కొబ్బరి చెట్లను నాటుకుంటే చాలు.. ఏడాదిలో లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు. కుండాపురలో నీర ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఇది రైతుల పాలిట వరంగా మారింది.

"రైతులకు తప్పకుండా వాళ్ల డబ్బు తిరిగి వచ్చేస్తుంది. 20 రూపాయలిస్తే, ఆ డబ్బు మళ్లీ ఆయనకు వస్తుంది. బాధలో ఉన్న వారికి ఈ పని కొంచెమైనా ఊరటనిస్తుంది. ఇతర పనులు చేసుకుంటూ ఉదయం 6 నుంచి 9 గంటలలోపు నీరను తీసి, అమ్ముకోవచ్చు. సాయంత్రాలు 5 నుంచి 7 గంటల వరకు మరోసారి ఈ పని చేసుకోవచ్చు. ఓవైపు వ్యవసాయం చేసుకుంటూనే నీర తీసే పనులు కూడా చేసుకుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టుగా రైతుల ఆదాయం రెట్టింపయ్యే అవకాశాలు వంద శాతం ఉన్నాయి."

- మురళీధర్, రైతు నేత

కుండాపుర తాలూకాలోని, జాప్తి గ్రామంలో నీర ప్రాసెసింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. 45 రోజుల పాటు 14 మందికి ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. కొబ్బరిచెట్లు ఎక్కడం, కొబ్బరికాయపై డబ్బా పెట్టి, నీరను ఎలా తీయాలో వీరికి నేర్పిస్తున్నారు. ఒకరోజు పాటు దాన్ని ఎలా నిల్వచేయాలో కూడా మెళకువలు చెప్తారు. ఇప్పటికే వెయ్యికిపైగా రైతులు ఈ కేంద్రంలో సభ్యులుగా చేరారు. వచ్చే ఐదేళ్లలో 5 వేల మందికి పైగా రైతు కుటుంబాలకు ఈ సొసైటీలో సభ్యత్వం ఇప్పిచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు నిర్వాహకులు.

"నీరను తీయడం నుంచి, పంపిణీ దాకా.. కోల్డ్‌ చైన్‌ ద్వారానే జరుగుతుంది. వెండింగ్ మెషీన్‌ నుంచి, కప్పుల్లో వినియోగదారులకు అందిస్తాం."

- సత్యనారాయణ ఉడుప, రైతు

ఒక్కో కుటుంబం కేవలం 8 చెట్ల నుంచే నీరను తీసి, విక్రయించుకునే అవకాశముంది. రోజుకు ఒక్కో చెట్టు నుంచి 2 లీటర్ల నీర ఉత్పత్తవుతుంది. ఈ లెక్కన ఒక రైతు ఏడాదికి 8 చెట్ల నుంచి 5వేల లీటర్ల నీరను ఉత్పత్తి చేసి, విక్రయిస్తే.. లక్ష రూపాయలకు పైగా సంపాదించవచ్చు. చెట్ల నుంచి నీర తీస్తే.. లీటరుకు 25 రూపాయలు వస్తాయి. వాటితో పాటు ఈఎస్​ఐ, పీఎఫ్​ లబ్ధి కూడా వారికి చేకూరుతోంది.

"33 ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్నా. దాంతోపాటు నీర కూడా ఉత్పత్తి చేస్తూ, విక్రయిస్తున్నా. దీని ద్వారా మంచి ఆదాయమే వస్తోంది. నీర తీయడం వల్ల కొబ్బరి చెట్టుకు ఎలాంటి నష్టమూ కలగదు. ఈ పని ప్రారంభించిన తర్వాత ఆర్థికంగా కాస్త కుదురుకున్నాం."

- కృష్ణ పూజారి

రోజుకు రెండుమూడు సార్లు చెట్ల నుంచి నీరను తీస్తారు. ఒక్కో ఊరిలో 20 నుంచి 30 మంది రైతు సంఘాలు ఏర్పడ్డాయి. వ్యవసాయంతో పాటు ఈ వ్యాపారం కూడా సక్రమంగా సాగితే.. రైతుల ఆదాయం రెట్టింపవడానికి ఎక్కువ సమయం పట్టదు.

ఇదీ చూడండి: కొవ్వొత్తులా వెలుగునిచ్చే 'పాండవ చెట్టు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.