ప్రముఖ కన్నడ నటి, బిగ్‌బాస్ షోలో పాల్గొన్న చైత్ర కొట్టూరు ఆత్మహత్యాయత్నం చేశారు. కోలార్‌లోని తన ఇంట్లో ఫినాయిల్ తాగారు. ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఆమె ఇటీవలే(మార్చి 28న) నాగార్జున అనే వ్యాపారవేత్తను ఓ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే వీరి వివాహ బంధంలో వివాదాలు తలెత్తాయని చర్చనడుస్తోంది. ఆమెను వివాహం చేసుకోవటం నాగార్జునకు ఇష్టం లేదని.. చైత్ర బలవంతం చేసిందని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు.
బిగ్ బాస్ కన్నడ సీజన్-7లో పాల్గొన్న చైత్ర కొట్టూరు.. సుజీదార అనే సినిమాలో సహాయక పాత్రలో నటించి మెప్పించారు.
ఇవీ చదవండి: పాఠశాలలో అగ్ని ప్రమాదం- మంటల్లో చిన్నారులు