సీపీఐ నేత, జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్(Kanhaiya kumar congress).. కాంగ్రెస్లో చేరడం దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. గతంలో ఇలాంటి వార్తలను కన్నయ్య ఖండించారు. అయితే గత శుక్రవారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సమక్షంలో రాహుల్ గాంధీని కలవడం కన్నయ్య(Kanhaiya kumar congress).. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ఊహాగానాలకు బలం చేకూర్చింది.
అందుకేనా?
ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్లో జరిగిన పార్టీ సమావేశంలో క్రమశిక్షణా రాహిత్యంగా వ్యవహరించారంటూ కన్నయ్యపై అభిశంసన తీర్మానం చేసింది సీపీఐ అధినాయకత్వం. దీంతో కన్నయ్య(Kanhaiya kumar congress) అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
కొత్త ఊపు..
గత రెండేళ్లలో జ్యోతిరాదిత్య సింధియా, సుస్మితా దేవ్, జితిన్ ప్రసాద, ప్రియాంక చతుర్వేది లాంటి కీలక నేతలు పార్టీని వీడటం కాంగ్రెస్కు కోలుకోలేని దెబ్బగా పరిణమించింది. ఇలాంటి పరిస్థితుల్లో మంచి వక్తగా, ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న కన్నయ్య చేరిక.. పార్టీకి లాభిస్తుందని కొందరు నేతలు విశ్వసిస్తున్నారు.
పార్టీ సమావేశాల్లో కన్నయ్య..
కన్నయ్య నిష్క్రమిస్తారనే వార్తలపై సీపీఐ కార్యదర్శి డి. రాజా స్పందించారు. ఈ నెలలోనే జరిగిన జాతీయ స్థాయి సమావేశానికి కన్నయ్య హాజరై, చర్చలో పాల్గొన్నారని తెలిపారు.
ఒంటరి పోరు..
ఇక కన్నయ్య పార్టీలో చేరితే వక్తగా అతడి నైపుణ్యాలను ఉత్తర్ ప్రదేశ్లోని పూర్వాంచల్ ప్రచారానికి వినియోగించుకోవాలని కాంగ్రెస్ (up congress news) భావిస్తోంది. వచ్చే ఏడాది యూపీ శాసనసభ ఎన్నికల్లో (UP Election 2022) ఎస్పీ, బీఎస్పీ.. పొత్తుకు విముఖత వ్యక్తం చేయడం వల్ల కాంగ్రెస్కు ఒంటరి పోరు తప్పడం లేదు.
ఇదీ చూడండి: priyanka gandhi up election: ప్రియాంక పోటీ చేస్తే.. ఎక్కడి నుంచి?