Kallakurichi student death: తమిళనాడులో 12వ తరగతి విద్యార్థిని అనుమానస్పద మృతి చెందిన బాలిక మృత దేహాన్ని అధికారులు ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. పోస్టుమార్టం అనంతరం విద్యార్థిని మృతదేహన్ని కడలూరు జిల్లాలోని బాలిక స్వగ్రామానికి అంబులెన్స్‌లో తరలించారు. మృతదేహన్ని చూసి బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.
కళ్లకురిచి జిల్లా కనియమూర్ ప్రాంతంలో గల ఓ ప్రైవేటు రిసెడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న బాధితురాలు జులై 13న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. హాస్టల్ భవనం మూడో అంతస్తు నుంచి.. దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై ఆందోళనకు దిగిన విద్యార్థులు.. పాఠశాల బస్సులకు నిప్పు పెట్టారు. అడ్డొచ్చిని పోలీసులపైనా ఎదురు దాడికి దిగారు. ఉపాధ్యాయుల.. వేధింపులు తాళలేక తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమిళనాడు వ్యాప్తంగా సంచలనం సృష్టించడం వల్ల దీనిపై సీబీ-సీఐడీ కేసు నమోదు చేసింది. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించింది.
కొన్ని రోజుల కింద జరిగిన ఆందోళనల సమయంలో స్కూల్లోని బెంచీలు, కుర్చీలను నిరసనకారులు ఎత్తుకెళ్లారు. పోలీసులు పాఠశాలకు సంబంధించిన సామాగ్రిని తిరిగిచ్చేయాలని హెచ్చరించడం వల్ల ఆ వస్తువులను తిరిగి పాఠశాల వద్ద వదిలిపెట్టారు ఆందోళనకారులు.
ఇవీ చదవండి: రైల్వే స్టేషన్లో సామూహిక అత్యాచారం.. అక్కడి ఉద్యోగుల పనే..