ETV Bharat / bharat

'కచ్చా బాదమ్' స్టార్​కు కష్టాలు.. ఇంటి అద్దె కట్టలేక వేరే ఊరికి మకాం.. అదే కారణమట!

'కచ్చా బాదమ్'​ పాటతో ఓవర్​నైట్​ స్టార్​గా మారిన భుబన్​ బద్యాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఒక్క పాటతోనే విపరీతమైన క్రేజ్​ను​ సంపాదించుకున్నారు​ ఈ శనగల వ్యాపారి. ప్రస్తుతం ఆయన ఇంటి అద్దె కట్టలేని స్థితిని చేరుకున్నారు. స్వగ్రామాన్ని విడిచిపెట్టే వేరు చోట ఉంటున్నారు. భుబన్​కు వచ్చిన కష్టాలేంటో తెలుసా?

Kacha Badam Fame Bhuvan Badhyakar Latest News
కచ్చా బాదమ్ ఫేమ్​ భువన్ బద్యాకర్ తాజా వార్తలు
author img

By

Published : Mar 5, 2023, 5:31 PM IST

'కచ్చా బాదమ్​'​ పాట వినని వాళ్లు ఉండరేమో. మరి ఈ పాటను అంతగా ప్రపంచానికి పరిచయం చేసిన భుబన్​​ బద్యాకర్​​ పేరు కుడా దాదాపు అందరికి సుపరిచితమే. అయితే ప్రస్తుతం ఆయన కష్టాల్లో కూరుకుపోయారు. ఆఖరికి ఇంటి అద్దె కట్టలేని స్థితికి చేరుకున్నారు. అసలేం జరిగిందంటే..
'కచ్చా బాదం' పాటతో ఓవర్​నైట్​ సెలబ్రిటీ​గా ఎదిగారు బంగాల్​కు చెందిన భుబన్​​ బద్యాకర్​​. అయితే ప్రస్తుతం ఉండటానికి ఇల్లు కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను సెలబ్రిటీగా మారిన తర్వాత వచ్చిన డబ్బును గ్రామస్థులు పలు దఫాలుగా తన నుంచి కాజేశారని వాపోయారు భుబన్​. ఇప్పుడు తన దగ్గరున్న మొత్తం సొమ్ము అయిపోవడం వల్ల గ్రామంలోని కొందరు యువకుల వేధింపులు భరించలేక స్వగ్రామాన్ని ఖాళీ చేసి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామంలో అద్దె ఇంట్లో భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఈ స్థితికి చేరుకోవడానికి స్థానికులే కారణమని చెబుతున్నారు భుబన్​.

కాగా.. తాను పాడిన కచ్చా బాదమ్​ పాటకు కాపీరైట్​ రావటం వల్ల ఇప్పుడు తాను పాటను పాడలేనని చెబుతున్నారు భుబన్​​. ప్రస్తుతం నేను ఏమి పని చేయట్లేదని.. ఆదాయమూ రావడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు​. ప్రస్తుతం ఇతడు పాకుర్తలాలోని ఓ గ్రామంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆ ఇంటి అద్దె నెలకు రూ.2700.

అయితే తాను హమ్​ చేసిన లిరిక్స్​తో తక్కువ వ్యవధిలోనే సెలబ్రిటీగా మారడం వల్ల ఇండస్ట్రీ నుంచి కొన్ని అవకాశాలూ వచ్చాయి భువన్​కు. ఆ సమయంలో సంపాదించిన డబ్బును ఇప్పటి వరకు ఖర్చు చేస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఈ డబ్బును గ్రామంలోని కొందరు యువకులు జల్సాల కోసం భుబన్​ దగ్గర డిమాండ్​ చేసి మరీ తీసుకెళ్లేవారట. దీంతో ఆయన దగ్గరున్న డబ్బంతా అయిపోవడం వల్ల గ్రామస్థుల వేధింపులు తట్టుకోలేక మరో ఊరికి మకాం మార్చారు భుబన్​. అయితే తన సొంత ఊర్లో కూడా భువన్​ అద్దె ఇంట్లోనే ఉండేవారట.

"నేను పాడిన పాట పాపులర్​ అవ్వడం వల్ల నేను కొద్ది రోజుల్లోనే సెలబ్రిటీ అయ్యాను. దీంతో నాకు చాలా అవకాశాలు వచ్చాయి. వాటితో నేను కొంత డబ్బు సంపాదించాను. కానీ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఎందుకంటే నా ఎదుగుదలను చూసి గ్రామంలోని కొందరు ఓర్వలేదు. నా దగ్గరున్న సొమ్మును కొందరు యువకులు పిక్​నిక్​, జల్సాల పేరుతో డిమాండ్​ చేసి తీసుకెళ్లేవారు. గొడవెందుకని నేను వారికి ఇచ్చేసేవాడిని. దీంతో నా దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి. ప్రస్తుతం నా పెద్ద కుమారుడు ప్రభుత్వ వాలంటీర్​గా పని చేస్తున్నాడు. ప్రస్తుతం అతడి సంపాదనతోనే మేము బతుకుతున్నాము."-

--భుబన్​ బద్యాకర్​​, కచ్చా బాదమ్​ ఫేమ్​

అందరి నోటా ఈ పాట..
ఈ ఒక్క పాటతో విపరీతమైన క్రేజ్​ను​ సంపాదించుకున్నాడు భుబన్​. ఈ పాట ఎంతలా ఫేమస్​ అయిందంటే దాదాపు అందరి నోటా వినిపించిందీ పాట. ఇటు భారత్​తో పాటు అటు బంగ్లాదేశ్​లోనూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ లిరిక్స్​కు స్టెప్పులు సైతం వేశారు. అంతేకాదు టెన్నిస్​ క్రీడాకారిణి పీవీ సింధు, నటి మాధురీ దీక్షిత్, నటుడు రితీష్ దేశ్‌ముఖ్, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హా వంటి ప్రముఖులు సైతం ఈ పాటకు డ్యాన్స్​ చేసి ప్రపంచాన్ని ఉర్రూతలూగించారు. పలు సందర్భాల్లో రాజకీయ పార్టీల ప్రచారాలు, టీవీ రియాలిటీ షోల్లో కూడా పాల్గొన్నారు భుబన్​​.

Kacha Badam Fame Bhuvan Badhyakar Latest News
భుబన్ బద్యాకర్

కౌన్​ హే యే భువన్ భాయ్​​..?
భువన్‌ స్వస్థలం బంగాల్‌ బీర్​భూం జిల్లాలోని కురల్‌జూరి గ్రామం. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. పచ్చి పల్లీలు, శనగలు అమ్ముకుంటూ భుబన్​ కుటుంబాన్ని పోషించేవారు. పాత సామాన్లు, పనికిరాని వస్తువులకు బదులు శనగలు, పల్లీలు ఇస్తూ.. వాటిని స్క్రాప్​ దుకాణాల్లో అమ్మగా వచ్చే డబ్బుతో జీవనం కొనసాగించేవారు. ఓ రోజు వీధిలో పల్లీలు అమ్ముతూ ఏదో సరాదాగా 'కచ్చా బాదామ్‌' అంటూ ఓ పాటను హమ్​ చేశాడు భువన్​. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దానిని రికార్డు చేసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశాడు. దీంతో ఈ వీడియో కొద్ది రోజుల్లోనే అనుకోని రీతిలో వైరల్​గా మారి విశేష స్పందన వచ్చింది. ఇక అప్పుడు ఓవర్​నైట్​ స్టార్​గా మారిపోయారు ఈ బంగాలీ పల్లీల వ్యాపారి.

ఇంట్లో భార్యతో కలిసి వంట చేస్తున్న కచ్చా బాదమ్ సింగర్​ భుబన్​ ​

కచ్చా బాదమ్​తో కారు కొన్నాడు..
అయితే కచ్చా బాదమ్​ పాటతో వచ్చిన రెమ్యునరేషన్​తో సెకండ్‌ హ్యాండ్‌ కారు కూడా కొనుక్కున్నారు భుబన్​​. స్వయంగా తానే కారును నేర్చుకునే క్రమంలో అప్పట్లో యాక్సిడెంట్‌ అయ్యింది. దీంతో ఛాతీలో బలమైన గాయం అయింది భువన్​కు. కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించగా క్రమంగా కోలుకున్నారు. పాటతో వచ్చిన పాపులారిటీ వల్ల తనను కిడ్నాప్‌ చేస్తారేమోనని భయంగా ఉందంటూ అప్పట్లో వార్తల్లో నిలిచారు భుబన్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.