JP Nadda Twitter Hack: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. ఉక్రెయిన్- రష్యా యుద్ధం, క్రిప్టో కరెన్సీపై నడ్డా ఖాతా నుంచి ఆదివారం వరుసగా ట్వీట్లు వచ్చినట్లు భాజపా వర్గాలు తెలిపాయి.
ఖాతా హ్యాక్‌కు గల కారణాల కోసం ట్విట్టర్‌తో మాట్లాడుతున్నట్లు మరో నాయకుడు తెలిపారు. అయితే కొద్దిసేపటి తర్వాత ట్విట్టర్ ఖాతా మళ్లీ పునరుద్ధరించిట్లు భాజపా వర్గాలు స్పష్టం చేశాయి.
'ఉక్రెయిన్ కోసం విరాళాలు ఇవ్వాలని ఓ ట్వీట్ రాగా.. క్రిప్టో కరెన్సీ పద్ధతిలో విరాళాలు పంపాలని మరో ట్వీట్ వచ్చినట్లు తెలిపాయి.
గతేడాది డిసెంబర్‌లోనూ ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్‌కు గురైంది.
ఇదీ చూడండి: ఆ చట్టం చుట్టే మణిపుర్ రాజకీయాలు!