Journalist Soumya Vishwanathan : టీవీ జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురిని దోషులుగా తేల్చుతూ దిల్లీ కోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఐపీసీలోని మోకా చట్టం ప్రకారం రవికపూర్, అమిత్ శుక్లా, బల్జీత్, అజయ్ కుమార్‌లను దోషులుగా తేల్చుతూ అదనపు సెషన్స్ కోర్టు జడ్జి రవీంద్ర కుమార్ పాండే ప్రకటించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితుల్ని న్యాయస్థానం దోషులుగా తేల్చింది. నలుగురు నిందితులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మల్లిక్, అక్షయ్ కుమార్‌ను హత్య, దోపిడీ అభియోగాల కింద దోషులుగా నిర్ధరించగా.. వారికి సాయం చేసిన అభియోగాలపై అజయ్ సేఠిని కూడా దోషిగా ప్రకటించింది. వీరికి త్వరలోనే శిక్ష ఖరారు కానుంది.
అప్పట్నుంచి కస్టడీలోనే..
Soumya Vishwanathan Murder Case : 15 ఏళ్ల క్రితం దేశ రాజధాని దిల్లీలో దారుణ హత్యకు గురైన ప్రముఖ టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. 2008 సెప్టెంబర్ 30న సౌమ్య తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో ఆఫీసు నుంచి కారులో ఇంటికి తిరిగి వస్తుండగా ఆమెను దుండగులు అడ్డగించి దోపిడీకి యత్నించారు. అనంతరం ఆమెపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో ఆమె ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ కేసులో ఐదుగుర్ని అరెస్ట్ చేయగా 2009 మార్చి నుంచి వారు జ్యూడీషియల్ కస్టడీలోనే ఉన్నారు. అప్పటి నుంచి దీనిపై సుదీర్ఘ విచారణ జరగ్గా.. తాజాగా నిందితులందరినీ దోషులుగా తేల్చుతూ దిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది.
-
#WATCH | Journalist Soumya Vishwanathan murder case: Soumya Vishwanathan's parents in Delhi's Saket court for verdict in the case pic.twitter.com/95wY7t6OBd
— ANI (@ANI) October 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Journalist Soumya Vishwanathan murder case: Soumya Vishwanathan's parents in Delhi's Saket court for verdict in the case pic.twitter.com/95wY7t6OBd
— ANI (@ANI) October 18, 2023#WATCH | Journalist Soumya Vishwanathan murder case: Soumya Vishwanathan's parents in Delhi's Saket court for verdict in the case pic.twitter.com/95wY7t6OBd
— ANI (@ANI) October 18, 2023
రోడ్డు ప్రమాదం అనుకున్నారు..
ముందుగా సౌమ్య విశ్వనాథన్ రోడ్డు ప్రమాదంలో మరణించి ఉండొచ్చని పోలీసులు భావించారు. అయితే పోస్టుమార్టం నివేదికలో ఆమె తలకు బుల్లెట్ గాయమైనట్లు బయటపడటం వల్ల హత్యగా నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. వీడియోల్లో ఆమె కారును దుండగులు ఉన్న మరో వాహనం వెంబడించినట్లు గుర్తించారు. దీని ఆధారంగా విచారణను కొనసాగించిన పోలీసులు 2009లో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. అయితే కేవలం దోపిడీ కోసమే సౌమ్యను నిందితులు హతమార్చారని పోలీసులు వెల్లడించారు.
సౌమ్య విశ్వనాథన్ కేసు విచారణ పూర్తి వివరాలు..
Delhi Journalist Soumya Viswanathan Case Status :
- 2008 సెప్టెంబర్ 30- తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో సౌమ్య తన కారులో పని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా దుండగులు కాల్చి చంపారు.
- 2009 మార్చి- ఐటీ ఎగ్జిక్యూటివ్ జిగిషా ఘోష్ హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల పోలీసులు.. సౌమ్య హత్య కేసులో పురోగతి సాధించారు.
- 2009 మార్చి 28- సౌమ్య హత్య కేసులో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్ కుమార్ అజయ్ సేథీలను పోలీసులు అరెస్టు చేశారు.
- 2009 జూన్ 22- ఐదుగురు నిందితులపై తొలి చార్జ్‌షీట్ దాఖలు
- 2010 ఫిబ్రవరి 6- నిందితులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద అభియోగాలు
- 2011 మే 9- మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) కింద నిందితులపై అభియోగాలు
- 2010 ఏప్రిల్ 23- విచారణ ప్రారంభం
- 2019 ఫిబ్రవరి- సత్వర విచారణ కోసం దిల్లీ హైకోర్టుకు మాలిక్
- 2019 ఫిబ్రవరి 6- విచారణ వెంటనే జరపాలని కోసం దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సంప్రదించిన సౌమ్య తల్లిదండ్రులు
- 2019 ఫిబ్రవరి 27- త్వరతగితిన విచారణకు దిల్లీ హైకోర్టు ఆదేశం. కనీసం వారానికి మూడుసార్లు ఈ అంశాన్ని విచారించాలని ట్రయల్ కోర్టుకు ఆదేశాలు
- 2022 మార్చి- నిందితుల సాక్ష్యాల నమోదు ప్రారంభం
- 2023 మే- తుది వాదనలు ప్రారంభం
- 2023 అక్టోబర్ 6- తుది వాదనలు ముగింపు
- 2023 అక్టోబర్ 13- కోర్టు తీర్పు రిజర్వ్
- 2023 అక్టోబరు 18- ఐదుగురిని దోషులుగా నిర్ధరించిన కోర్టు
- 2023 అక్టోబరు 26- శిక్షపై కోర్టు ఉత్తర్వులు జారీ చేసే అవకాశం