Jk Reservation Amendment Bill 2023 On Amit Shah : 70ఏళ్ల నుంచి హక్కులు కోల్పోయినవారికి న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రెండు బిల్లులు తెచ్చినట్లు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా తెలిపారు. నిర్వాసితులైనవారు ఈ రిజర్వేషన్ల ద్వారా చట్టసభలో తమ వాణి వినిపించేందుకు ఈ బిల్లులు ఉపయోగపడుతాయన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్‌లో దేశంలో భాగమేనని తెలిపారు. అందుకే అక్కడ కూడా 24 స్థానాలను రిజర్వ్ చేసినట్లు ప్రకటించారు.
కశ్మీర్‌లో రెండు స్థానాలను కశ్మీర్ నుంచి వలసవెళ్లినవాళ్లు, ఒక స్థానాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడినవారికి రిజర్వ్ చేసినట్లు అమిత్ షా తెలిపారు. తొలిసారిగా ఎస్సీ/ఎస్టీ కమ్యూనిటీలకు 9 స్థానాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. కాగా, జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లు, జమ్ముకశ్మీర్ పునర్విభజన సవరణ బిల్లులను లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
-
VIDEO | "I stand in the House and say responsibly that Kashmir suffered for several years because of the two blunder during the tenure of PM Jawaharlal Nehru. The biggest mistake was that when our forces were winning, cease fire was announced and PoK came into existence. Had the… pic.twitter.com/lwGy8od3YR
— Press Trust of India (@PTI_News) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | "I stand in the House and say responsibly that Kashmir suffered for several years because of the two blunder during the tenure of PM Jawaharlal Nehru. The biggest mistake was that when our forces were winning, cease fire was announced and PoK came into existence. Had the… pic.twitter.com/lwGy8od3YR
— Press Trust of India (@PTI_News) December 6, 2023VIDEO | "I stand in the House and say responsibly that Kashmir suffered for several years because of the two blunder during the tenure of PM Jawaharlal Nehru. The biggest mistake was that when our forces were winning, cease fire was announced and PoK came into existence. Had the… pic.twitter.com/lwGy8od3YR
— Press Trust of India (@PTI_News) December 6, 2023
లోక్‌సభలో ఈ బిల్లులపై జరిగిన చర్చకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలను దృష్టిలో పెట్టుకోకుండా ఆరంభంలోనే ఉగ్రవాదాన్ని అణిచివేసి ఉంటే పండిట్లు కశ్మీర్ లోయను వీడాల్సి వచ్చేది కాదన్నారు. ఉగ్రవాదం కారణంగా కశ్మీర్‌లోయను వీడినవారికి శాసనసభలో ప్రాతినిథ్యం కల్పించేందుకు వీలుగా ఒక బిల్లు తెచ్చినట్లు చెప్పారు. వెనుకబడిన తరగతులను వ్యతిరేకించటమే కాకుండా వారి అభివృద్ధిని అడ్డుకున్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే అని అమిత్ షా దుయ్యబట్టారు.
-
#WATCH | Union HM Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023
— ANI (@ANI) December 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
He says, "...When terrorism tightened its grip, when everyone started being targeted and driven away, many people expressed their… pic.twitter.com/tov7Ua9ENA
">#WATCH | Union HM Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023
— ANI (@ANI) December 6, 2023
He says, "...When terrorism tightened its grip, when everyone started being targeted and driven away, many people expressed their… pic.twitter.com/tov7Ua9ENA#WATCH | Union HM Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023
— ANI (@ANI) December 6, 2023
He says, "...When terrorism tightened its grip, when everyone started being targeted and driven away, many people expressed their… pic.twitter.com/tov7Ua9ENA
"కశ్మీర్ పండిట్లు ఎన్నికల్లో గెలిచి శాసనసభ కూర్చునే పరిస్థితి లేదు. అధికరణ 370 ఏమైందని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆగస్టు 5, 6 నుంచి ఎక్కడుంది. 2019 ఆగస్టు 5, 6లో కొన్నేళ్లుగా వినని వారి వాణిని నరేంద్రమోదీ విన్నారు. ఇప్పుడు వారికి అధికారం దక్కింది. 2019 ఆగస్టు 5, 6 బిల్లు కొందరిని చెప్పులో రాయిలా గుచ్చుతోంది. వారికి నేను చెప్పదలుచుకున్నా. ఆ బిల్లులో భాగమే న్యాయ పునర్విభజన. ఇది ఒక పదం కాదు. రెండు పదాలను కలిసి చేశాం. ముందు జరిగిన పునర్విభజన ఎలా ఉండేదంటే ఒక నియోజకవర్గం ఇక్కడ ఉంటే, అందులో కొంతభాగం 15కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఎందుకంటే ఎన్నికల్లో గెలవాలి. ఆ విధంగా పునర్విభజన జరిగింది. చట్టసభ సభ్యునిగా ఉద్దేశపూర్వకంగానే న్యాయ పునర్విభజన అని రాశాను. అదే సభలో పెట్టాను."
--అమిత్ షా, కేంద్ర హోం శాఖ మంత్రి
ఇక, ప్రతిపక్షాలు కశ్మీర్‌లో ఆర్టికల్ 370 తొలగింపు తర్వాత కూడా ఉగ్రవాదం కొనసాగడంపై అడిగిన ప్రశ్నకు అమిత్‌షా సమాధానమిచ్చారు. 'మోదీ ప్రభుత్వం వచ్చాక పౌర మరణాల్లో 70 శాతం, భద్రతా సిబ్బంది మరణాల్లో 62శాతం తగ్గుముఖం పట్టాయి. ఆర్టికల్ 370 తొలగింపుతో ఉగ్రవాదం అంతమైపోతుందని ఎవరూ చెప్పలేదు. వేర్పాటువాదం అంతమవుతుందని నేను చెప్పాను. 2027 నాటికి ఉగ్రవాద ఘటనలు సున్నాకు తీసుకురావడం కోసం ప్రణాళికలు రచిస్తున్నాం' అని తెలిపారు.
పవర్ఫుల్ లేడీగా నిర్మలా సీతారామన్- వరుసగా ఐదోసారి జాబితాలో చోటు
పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో మోసాలు- 100కు పైగా వెబ్సైట్లను బ్లాక్ చేసిన కేంద్రం