ETV Bharat / bharat

కశ్మీర్​లో ఒంటిగంట వరకు 47 శాతానికిపైగా పోలింగ్​ - కశ్మీర్​ ఎన్నికలు

JK DDC POLLS
జమ్ముకశ్మీర్​: మందకొడిగా ఏడో విడత పోలింగ్​
author img

By

Published : Dec 16, 2020, 9:24 AM IST

Updated : Dec 16, 2020, 2:42 PM IST

14:32 December 16

ఒంటిగంట వరకు 47శాతానికిపైగా పోలింగ్​..

కశ్మీర్​ స్థానిక ఎన్నికల ఓటింగ్​ కొనసాగుతోంది. ఒంటిగంట వరకు మొత్తం 47.43 శాతం పోలింగ్​ నమోదైంది. 2.30 గంటలకు ఓటింగ్​ ముగియనుంది. కానీ.. క్యూలో నిల్చున్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 

12:11 December 16

11 గంటల వరకు 28.24 శాతం..

జమ్ముకశ్మీర్​లో ఏడో విడత స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. 11 గంటల వరకు 28.24 శాతం పోలింగ్​ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

చలితీవ్రత అధికంగా ఉండటంతో తొలుత ఓటింగ్ ప్రక్రియ మందకోడిగా సాగినప్పటికీ క్రమంగా పుంజుకుంటోంది. 

ఏడో విడతలో.. జమ్ముకశ్మీర్‌లోని 31 జిల్లా అభివృద్ధి మండలి స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుండగా వీటిలో 13 స్థానాలు కశ్మీర్‌ డివిజన్‌లో, 18 జమ్మూ డివిజన్‌లో ఉన్నాయి. డీడీసీలతో పాటు 69 సర్పంచ్, 438 పంచ్‌ స్థానాలకు కూడా ఓటింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 2గంటలకు పోలింగ్ ముగియనున్నట్లు అధికారులు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో 8 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండగా ప్రస్తుతం ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది. 

10:06 December 16

10.66 శాతం..

జమ్ముకశ్మీర్​ ఏడో విడత స్థానిక ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 10.66 శాతం పోలింగ్​ నమోదైంది. చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. 

09:12 December 16

కశ్మీర్​లో 11 గంటల వరకు 28.24 శాతం పోలింగ్​

జమ్ముకశ్మీర్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఏడో విడత పోలింగ్ ప్రారంభమైంది. చలితీవ్రత అధికంగా ఉండటం వల్ల ఓటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోందని అధికారులు తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చేందుకు ఆసక్తి చూపటం లేదని చెప్పారు. కశ్మీర్ లోయ, చినాబ్ లోయలో సబ్‌ జీరో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. 

ఏడో విడతలో.. 31 జిల్లా అభివృద్ధి మండలి స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతుండగా...వీటిలో 13 స్థానాలు కశ్మీర్‌ డివిజన్‌లో, 18 జమ్ము డివిజన్‌లో ఉన్నాయి. డీడీసీలతో పాటు 69 సర్పంచ్, 438 పంచ్‌ స్థానాలకు కూడా ఓటింగ్ జరుగుతోంది. మధ్యహ్నం 2 గంటలకు పోలింగ్ ముగియనున్నట్లు అధికారులు చెప్పారు. జమ్ముకశ్మీర్‌లో 8 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండగా...ప్రస్తుతం ఏడో విడత పోలింగ్ కొనసాగుతోంది.

Last Updated : Dec 16, 2020, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.