ETV Bharat / bharat

ఝార్ఖండ్​లో ఈనెల 14 నుంచి 18 ప్లస్​కి ఉచిత టీకా - టీకా పంపిణీ

ఝార్ఖండ్​లో 18 ఏళ్లు పైబడిన వారికి ఈనెల 14 నుంచి ఉచితంగా టీకా పంపిణీ ప్రారంభిస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. టీకాలు అందుబాటులో ఉన్న తీరును బట్టి అర్హత కలిగిన వారికి అందిస్తామని తెలిపింది.

vaccination
టీకా పంపిణీ
author img

By

Published : May 10, 2021, 10:42 PM IST

ఝార్ఖండ్​లో 18-44 ఏళ్ల వయసు వారికి ఉచిత టీకా పంపిణీ చేపట్టనున్నట్లు ఆ ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 14 నుంచి ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి హేమంత్​ సొరేన్​ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ల కొరత కారణంగా మే 1న పంపిణీ చేపట్టలేకపోయినట్లు పేర్కొన్నారు.

" 18 ఏళ్లు పైబడిన వారికి మే 14 నుంచి టీకా అందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వమే టీకాల ఖర్చు భరించి.. ఉచితంగా అందిస్తుంది. టీకాలు అందిన తీరును బట్టి అర్హత కలిగిన వారికి ఇస్తాం. "

- హేమంత్​ సొరేన్​, ఝార్ఖండ్​ ముఖ్యమంత్రి.

ఎలాంటి అసత్య వార్తలు నమ్మకుండా ప్రజలు ముందుకు వచ్చి ఉచితంగా వ్యాక్సిన్​ తీసుకోవాలని ప్రజలను కోరారు సీఎం. సంతల్​ పరగనాస్​, పలాము డివిజన్​ ఎమ్మెల్యేలు, ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించి కొవిడ్​ కట్టడి చర్యలను సమీక్షించారు.

50 లక్షల టీకా డోసుల కోసం ఇప్పటికే ఆర్డర్​ ఇచ్చింది ఝార్ఖండ్​ ప్రభుత్వం. రాష్ట్రంలో 1.57 కోట్ల మంది ప్రజలు 18-44 ఏళ్ల వారు. ఇప్పటి వరకు 27.31 లక్షల మందికి టీకా తొలి డోసు ఇచ్చారు. 5.85 లక్షల మంది రెండో డోసు తీసుకున్నారు.

ఇదీ చూడండి: జెరూసలెంలో మళ్లీ ఘర్షణలు- అమెరికా ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.