ETV Bharat / bharat

భార్యతో గొడవ.. నాటు బాంబు కొరికి వ్యక్తి ఆత్మహత్య - భార్యతో గొడవ.. నాటు బాంబు తిని వ్యక్తి ఆత్మహత్య

ఝార్ఖండ్​లో ఓ వ్యక్తి నాటుబాంబును కొరికి ఆత్మహత్యకు చేసుకున్నాడు. భార్యతో గొడవ పడిన అనంతరం.. అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.

Man commits suicide by clenching crude bomb between teeth
నాటు బాంబు తిని వ్యక్తి ఆత్మహత్య
author img

By

Published : May 7, 2021, 1:27 PM IST

ఇంట్లో గొడవ జరగడం వల్ల మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి నాటుబాంబును కొరికి ఆత్మహత్య చేసుకున్నాడు. గిరిదిహ్ జిల్లా హరిజన్​తోలా గ్రామానికి చెందిన విక్కీ తురి అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తన అత్తగారి ఇంట్లో భార్యతో జరిగిన వాగ్వాదమే ఈ ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది.

ఇదీ జరిగింది..

గురువారం ఉదయం సమీప గ్రామంలోని అత్తగారింట్లో ఉన్న భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు విక్కీ వెళ్లాడు. కొన్నాళ్లుగా అక్కడే ఉంటున్న ఆమెను ఇంటికి రావాల్సిందిగా కోరాడు. ఈ క్రమంలో గొడవ జరిగ్గా.. సాయంత్రం ఇంటికి తిరగొచ్చాడు. అయితే మనస్థాపంతోనే విక్కీ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అడవి పందులను చంపడానికి ఉపయోగించే నాటు బాంబును కొరికి విక్కీ ఆత్మహత్యకు పాల్పడినట్లు.. స్థానికులు తెలిపారు.

ఇవీ చదవండి: బంగాల్​లో బాంబు పేలుడు- ఆరుగురికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.