Police officer hand broke Vaccination: కరోనా టీకా తీసుకోవడానికి ససేమిరా అన్న ఓ వ్యక్తి అతణ్ని ఒప్పించడానికి యత్నించిన పోలీస్ అధికారితో గొడవపడి చెయ్యి విరగ్గట్టాడు. రూర్జండ్‌లోని గిరిధ్ జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది!
అక్కడి మహువర్ గ్రామ ప్రజలను టీకాలు తీసుకునేలా ప్రోత్సహించడానికి అధికారులు వచ్చారు. వారితోపాటు పోలీస్ అధికారి కృష్ణ కుమార్ మరాండికూడా ఉన్నారు. అయితే రామచంద్ర ఠాకుర్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులు టీకా తీసుకోమని చెప్పారు. వారికి వ్యాక్సిన్ ప్రయోజనాల గురించి చెప్పి ఒప్పించడానికి కృష్ణ కుమార్ యత్నించారు. ఈక్రమంలో ఆయనపై ఆగ్రహానికి గురైన ఠాకుర్ కర్రతో దాడి చేయగా చెయ్యి విరిగింది.
వెంటనే ఠాకుర్ అక్కడి నుంచి పారిపోయాడు. కృష్ణ కుమార్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఠాకుర్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి: 'పిల్లలకు కొవిడ్ టీకా ఇవ్వాలన్న నిర్ణయం అశాస్త్రీయం'