Jaskaran Singh Kbc : బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 15లో జస్కరణ్ సింగ్(21) పాల్గొని విజేతగా నిలిచాడు. సీజన్ 15 ప్రారంభైన 20 రోజులలో మొదట కోటి రూపాయల ప్రైజ్ మనీని గెలుచుకున్న వాడిగా జస్కరణ్ సింగ్ రికార్డ్ సృష్టించాడు.
సివిల్స్ లక్ష్యంగా...
జస్కరణ్ సింగ్‌ది చాలా పేద కుటుంబం. వీరికి కొంత వ్యవసాయ భూమి ఉంది. ఇతడు తరన్ తారన్ జిల్లా ఇండోపాక్ సరిహద్దున ఉన్న ఖల్రా గ్రామానికి చెందినవాడు. ఇతను చదువుకునే కాలేజీ నుంచి వీరి ఇంటికి చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. కాలేజీలు దూరంగా ఉండటం వల్ల చాలా మంది ఇక్కడ చదువుకోని వారు ఉన్నారు. ప్రస్తుతం జస్కరణ్ సింగ్ సివిల్స్‌కు సిద్ధం అవుతున్నాడు. మొదటిసారి సివిల్స్ పరీక్షలను రాయబోతున్నాడు.
ఇది నాలుగవ ప్రయత్నం..
జస్కరణ్ సింగ్ కోటి రూపాయలు గెలుచుకున్న ప్రోగ్రామ్‌కు సంబంధించి, ప్రోమోను సోనీ టీవీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గత నాలుగు సంవత్సరాల నుంచి కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొనాలని జస్కరణ్ సింగ్ ప్రయత్నిస్తున్నానని తెలిపాడు. మూడు సార్లు ముంబాయిలో ఇంటర్వూకు హజరయ్యానని చెప్పాడు.
సీజన్-14లో కోటి గెలిచిన మహిళ..
గత 'కౌన్ బనేగా కరోడ్‌పతి' సీజన్ 14లో మహారాష్ట్ర కొల్హాపుర్ జిల్లా గాంధీనగర్‌కు చెందిన కవితా చావ్లా కేబీసీలో రూ.కోటి గెలుచుకున్నారు. ఈమె 12 వ తరగతి వరకు చదువుకున్నారు. తరవాత వస్త్ర వ్యాపారం చేసే విజయ్ చావ్లాను పెళ్లి చేసుకున్నారు. 22 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ షోలో పాల్గొనాలని కవితా చావ్లా కలలు కన్నారు. అందుకోసం కవితా చావ్లా రోజు జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకునేవారు.
2013లో మిస్ అయినా...
కవితా చావ్లా 2013లో కేబీసీ టాప్-10కు ఎంపిక అయ్యారు. కానీ, హాట్ సీట్ వరకు వెళ్లలేదు. అయినా నిరాశ చెందకుండా, సీజన్-14 లో హాట్ సీట్ వరకు వెళ్లి కోటి రూపాయలను గెలుచుకున్నారు. గెలిచిన డబ్బుతో తన భర్త వ్యాపారం కోసం తీసుకున్న అప్పును తీర్చి, కుమారుడు బ్రిటన్ వెళ్లడం కోసం ఖర్చు చేస్తానని చెప్పారు.